సత్తెన పల్లిలో సడెన్ బ్రేకులు..! ఇక అంబటి రాంబాబు దారెటు..?
అమరావతి/హైదరాబాద్ : వైసీపీ అంటే తానే అనుకుంటాడు. జగన్‌కు కుడిభుజమని భావిస్తాడు. ఆనాడు వైఎస్ హయాంలో చక్రం తిప్పినట్టు మరోసారి అధికారం అనుభవించాలనే ఆరాటం. అసలు పార్టీ అధినేత ఆయనకు అంత సినిమా ఇస్తాడో లేదో తెలియదు గాని మనోడు మాత్రం ఆస్కార్ రేంజ్ లో రెచ్చిపోతుంటాడు. ఆయనే అంబటి రాంబాబు. జేబులో దువ్వెన.. ఫాన్ గాలికి చెదరని క్రాఫ్‌తో మీడియాలో మాట్లాడాలంటే అంబటే అనేంతగా పేరు సంపాదించాడు. కానీ ఓ మహిళా నేతతో అసభ్యకరమైన సెల్ ఫోన్ లో అసభ్యకరంగా మాట్లాడి అడ్డంగా దొరికి కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు. మళ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యే పనిలో పడ్డారు. అంతా అనుకున్నట్టు జరిగితే సత్తెనపల్లి నుంచి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించారు.

ఇదిలా ఉండగా మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి రూపంలో అంబటి రాంబాబుకు శరాఘాతం ఎదురైంది. అంతే కాదు సొంతగూటిలో పోటీ అనే కుంపటి మొదలైంది. దీంతో అటు కక్కలేక, ఇటు మింగలేక, మరో నియోజకవర్గం వెతుక్కునే పనిలో పడ్డారట అంబటి రాంబాబు. గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి బరిలోకి దిగిన అంబటి రాంబాబు స్వల్ప ఓట్ల తేడాతో కోడెల శివప్రసాద్‌పై ఓటమి చవిచూశారు. స్థానికంగా స్వయంకృతాపరాధం వల్లనే అంబటి ఓటమి చెందారనే విమర్శలూ లేకపోలేదు. మరోసారి అద్రుష్టాన్ని పరీక్షించుకునేందుకు నాలుగేళ్లుగా సత్తెనపల్లిలో ఉంటున్నారు. కానీ ఇటీవల టీడీపీని వీడిన మోదుగులకు పార్టీ అదిష్ఠానం సత్తెనపల్లి నియోజకవర్గాన్ని ఖరారు చేసింది. దీంతో అంబటి రాంబాబు పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications