పవన్! ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నావ్?: బిజెపి నేత ప్రశ్న

విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై బిజెపి నేత సుధీష్ రాంభట్ల తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రధాని నరోంద్ర మోడీని అవహేళన చేయడం పవన్ కల్యాణ్ మానుకోవాలని ఆయన సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సాయం కేంద్రం ఏ రాష్ట్రానికి కూడా చేయలేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా గతంలో ఈ విషయం చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు.

పవన్ కల్యాణ్ దానికి సమాధానం చెప్పాలి

పవన్ కల్యాణ్ దానికి సమాధానం చెప్పాలి

పవన్ కల్యాణ్ సంయుక్త నిజ నిర్ధారణ కమిటీని ఎందుకు పెట్టారో తెలుసుకోవాలని సుధీష్ రాంభట్ల సూచించారు. జెఎఫ్‌సిలో ఉన్న ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఒకరు అవునంటే మరొకరు కాదంటున్నారని అన్నారు. జెఎఫ్‌సి విధివిధానాలను ప్రజలకు ముందు స్పష్టంగా చెప్పాలని, ఆ తర్వాతే ఇతర విషయాలు అడగాలని ఆయన అన్నారు

Recommended Video

    YSRCP MLA Roja questions Pawan over JFC
     బహిరంగ చర్చకు సిద్దమా..

    బహిరంగ చర్చకు సిద్దమా..

    రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయంపై తెలుగుదేశం పార్టీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమా అని సుధీష్ రాంభట్ల సవాల్ చేశారు. కేంద్రం ఇచ్చిన ప్రతి పైసాకు లెక్కలు చెప్పాలని ఆయన అభిప్రాయపడ్డారు. పదేళ్లలో ఇవ్వాల్సిన విద్యాసంస్థలను రాష్ట్రానికి ఒకే ఏడాదిలో బిజెపి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు.

     చంద్రబాబు దాన్నెందుకు రద్దు చేశారు

    చంద్రబాబు దాన్నెందుకు రద్దు చేశారు

    అన్ని సక్రమంగా ఉన్న భోగాపురం విమానాశ్రయం టెండర్‌ను చంద్రబాబు ఎందుకు రద్ద చేశారని సుధీష్ రాంభట్ల అడిగారు. దానికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాము చెప్పిన లెక్కలు ప్పని తేలితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు.

     మాకు స్పష్టత ఉంది...

    మాకు స్పష్టత ఉంది...

    ప్రత్యేక హోదాపై తమ పార్టీకి స్పష్టత ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. హోదాపై జాతీయ పార్టీలు కలిసి వస్తే తాము మద్దుతుగా ఉంటామని రెండేళ్ల క్రితమే తాము చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా టిడిపి కలిసి వస్తే మంచిదని అన్నారు.

     ఆ విషయం పవన్ కల్యాణ్ చెప్పాలి

    ఆ విషయం పవన్ కల్యాణ్ చెప్పాలి

    టిడిపి, బిజెపిలతో స్నేహం ఉందా, లేదా అనే విషయాన్ని పవన్ కల్యాణ్ చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. ముందస్తు ఎన్నికలు రావని చెప్పడానికి మంత్రి నారాయణ ఎన్నికల కమిషనరా అని ఆయన నిలదీశారు.

     లంచాల కోసమే అలా...

    లంచాల కోసమే అలా...

    కిక్ బాక్స్ కోసమే భోగాపురం విమానాశ్రయం టెండర్లను రద్దు చేశారని బొత్స చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు విమానాశ్రయం నిర్మించే అనుభవం లేదని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు చెప్పడం దారుణమని అన్నారు. మంత్రి బాధ్యతరహితంగా మాట్లాడుతున్నారని అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+