శోభనం రోజు ఊహించని షాకిచ్చిన నవ వధువు
ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. శోభనం జరగడానికి ముందే ఒక నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. సోమందేపల్లికి చెందిన 22 ఏళ్ల హర్షితకు, కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన నాగేంద్రతో సోమవారం వివాహం జరిగింది. రెండు నెలల క్రితమే నిశ్చితార్థం జరిగి, ఆగస్టు 4న వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత శోభనం ఏర్పాట్ల కోసం కొత్త జంటను పెళ్లికూతురి ఇంటికి తీసుకువచ్చారు.

అయితే, ఏం జరిగిందో కానీ అదే రోజు రాత్రి హర్షిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించగా, షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి జరిగిన రోజు రాత్రి హర్షిత తన తల్లిదండ్రులతో తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. పెళ్లి జరిగిపోయిన తర్వాత ఈ విషయం చెబితే పరువు పోతుందని ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పారు. దీనితో హర్షిత ప్రశాంతంగా ఉంటానని చెప్పి గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన కుటుంబంలో మరియు ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.












Click it and Unblock the Notifications