ఏపీ సచివాలయంలో కలకలం, అమరావతికి భారీ మెడికల్ ప్రాజెక్ట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని ఎల్ బ్లాకులో శుక్రవారం నాడు ఓ సూటుకేసు కలకలం రేగింది. ఎల్ ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండే ఫ్లోర్. సూటుకేసు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది.
సచివాలయానికి వచ్చిన ఓ మహిళ తన సూటుకేసును గది బయట ఉంచి లోపలకు వెళ్లిన సమయంలో అక్కడ ఉన్న కొంతమంది సిబ్బంది కంగారు పడి పోలీసులకు సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది. వారు సూటుకేసును తెరిచి చూడగా అందులో దుస్తులు మాత్రమే ఉన్నాయి. దీంతో ఊపిరి పీల్చుకున్నారు.

అమరావతికి భారీ మెడికల్ ప్రాజెక్టు
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి మరో భారీ మెడికల్ హెల్త్ ప్రాజెక్టు వచ్చింది. వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అమృత యూనివర్సిటీ ముందుకొచ్చింది. విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో విశ్వవిద్యాలయ ప్రతినిధులు చర్చించారు.
విశ్వవిద్యాలయానికి అనుబంధంగా 2,250 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కూడా చేపడతామని తెలిపింది. దాంతోపాటు రీసెర్చ్ అండ్ హెల్త్ కేర్ క్యాంపస్ నిర్మాణం చేయనుంది. రూ.2,500 కోట్లతో రాజధానిలో ఈ మెగా ప్రాజెక్టు నిర్మాణం కానుంది.
అనంతపురంలో అగ్ని ప్రమాదం
అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం పాతబస్టాండు దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. ఆరు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. రూ.10 లక్షల దాకా ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది.
కాగా, కడప జిల్లా పాలకొండలో భర్త చేతిలో భార్య, కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. వారి మృతదేహాలను పోలీసులు శక్రవారం వెలికితీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రెండు నెలల క్రితం ప్రవీణ్ అనే వ్యక్తి తన భార్య, కొడుకుకు బిర్యానీలో విషం పెట్టి కలిపిన విషయం తెలిసిందే.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు












Click it and Unblock the Notifications