సుజనా చౌదరి: కేంద్రంలో టిడిపి తరపున చక్రం
అమరావతి: సుజనా చౌదరి. కేంద్రంలో టిడిపి తరపున చక్రం తిప్పుతున్నారు. 2014 ఎన్నికల సమయంలో టిక్కెట్ల పంపిణీలో తెర వెనుక సుజనా చౌదరి కీలకంగా వ్యవహరించారని చెబుతారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టిడిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడ టిడిపిలో సుజనా చౌదరి కీలకంగా వ్యవహరించారు. 2004 - 2014 మధ్య తెలుగుదేశం పార్టీకి, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అండగా నిలిచిన సుజనా చౌదరి తర్వాత రాజ్యసభకు ఎన్నిక అయ్యారు.

2014 ఎన్నికల్లోనూ అన్ని విధాల అండదండలు కల్పించిన సుజనా చౌదరి ప్రస్తుతం నరేంద్రమోదీ క్యాబినెట్‌లో సహాయ మంత్రిగా ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబుతోపాటు కీలకంగా మారారు..కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇచ్చే విషయంలో కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమై రాష్ట్ర డిమాండ్లను ప్యాకేజీలో చేర్చారనే ప్రచారం కూడ లేకపోలేదు.












Click it and Unblock the Notifications