పవన్‌ది సిల్లీ క్యారెక్టర్, విజయసాయి గబ్బు: ఆదినారాయణ, 'మోడీ-జైట్లీ వద్ద సుజన లాబీయింగ్'

అమరావతి/కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డిపై మంత్రి ఆదినారాయణ రెడ్డి బుధవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన నీచాతినీచంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వలాభాల కోసం సంస్కారహీనంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

తాను బెంగళూరులో ట్రస్ట్ నుడుపుతుంటే క్లబ్ నడుపుతున్నాడని ఆరోపణలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఉరివేసుకుంటానని సవాల్ చేశారు. ఆయన గలీజు.. గబ్బు వ్యక్తి అన్నారు. మతిభ్రమించి గతి తప్పాడన్నారు.

విజయసాయిరెడ్డిని మోడీ కూడా కాపాడలేదు

విజయసాయిరెడ్డిని మోడీ కూడా కాపాడలేదు

విజయ సాయి రెడ్డి కేసుల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆదినారాయణ రెడ్డి అన్నారు. కాళ్లు పట్టుకున్నా మోడీ కూడా ఆయనను కాపాడలేరని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి కేంద్రం పిడికెడు పిండాకూడు మెతుకులు వేసిందన్నారు.

పవన్ కళ్యాణ్ పైనా విరుచుకుపడ్డారు

పవన్ కళ్యాణ్ పైనా విరుచుకుపడ్డారు

ఆదినారాయణ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు. పవన్ సినిమాల్లో సిల్లీ క్యారెక్టర్ లాంటివాడన్నారు. ఆయనతో తమకు ఎలాంటి నష్టం లేదని అభిప్రాయపడ్డారు. ఇటీవల గుంటూరు బహిరంగ సభలో పవన్ విమర్శలు చేసినప్పటి నుంచి టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

మోడీ కాళ్లు పట్టుకుంది చంద్రబాబే

మోడీ కాళ్లు పట్టుకుంది చంద్రబాబే

ఇదిలా ఉండగా, విజయసాయి రెడ్డిపై టీడీపీ, చంద్రబాబులు చేసిన ఆరోపణలు నిరాధారం అని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాజకీయ లబ్ధి కోసం టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టిందని ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి దించారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకుంది చంద్రబాబేనని, సోషల్ మీడియాలో పోస్టులు హల్‌చల్ చేస్తున్నాయన్నారు.

మోడీ, జైట్లీ వద్ద లాబీయింగ్

మోడీ, జైట్లీ వద్ద లాబీయింగ్

నరేంద్ర మోడీ, అరుణ్ జైట్లీలతో సుజనా చౌదరి లాబీయింగ్ కరెక్ట్ కాదా అని వెల్లంపల్లి విమర్శించారు. బెజవాడలో బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్‌లు జోకర్లు అన్నారు. అమ్మను కార్పోరేటర్ చేయలేని బుద్దా వెంకన్న ఏం చేసి ఎమ్మెల్సీ, విప్ తెచ్చుకున్నారో అందరికీ తెలుసునని చెప్పారు. వైసీపీ నుంచి గెలిచిన జలీల్ ఖాన్‌కు దమ్ముంటే రాజీనామా చేసి మాట్లాడాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+