Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కళ్యాణ్! ఇప్పుడు చెప్పు, సారీ చెప్తున్నా, ఇదీ నా కంపెనీ!: సుజన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు, వైసిపి చీఫ్ జగన్‌లకు కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి శుక్రవారం కౌంటర్ ఇచ్చారు.

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు, వైసిపి చీఫ్ జగన్‌లకు కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి శుక్రవారం కౌంటర్ ఇచ్చారు. హోదా పేరుతో యువతను రెచ్చగొట్టడం సరికాదన్నారు. కేంద్రం సహకరిస్తుందని, జరిగిన నష్టమేంటో చెప్పాలని సుజన నిలదీశారు.

ఏపీకి ప్రత్యేక హోదా వస్తే అదనంగా రూ.3వేల కోట్లు వస్తాయని, వాటిని కేంద్రం రుణం రూపంలో ఇస్తామని చెప్పిందన్నారు. ఆ రుణం కూడా కేంద్రమే తీర్చుకుంటుందని చెప్పారు. ఇక జరిగిన నష్టమేమిటో చెప్పాలని పవన్‌ను నిలదీశారు.

హోదా వల్ల పరిశ్రమలు వస్తాయని చెప్పడం తప్పు అన్నారు. హోదాకు జల్లికట్టుకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. హోదాతో వచ్చే ప్రయోజనాలను కేంద్రం ఇస్తుందన్నారు. ప్లానింగ్ కమిషన్ వేరు, ఫైనాన్స్ కమిషన్ వేరు అన్నారు.

sujana choudhary

పోలవరంకు 100 శాతం నిధులు

జాతీయ ప్రాజెక్టు అంటే కేంద్రం 60 శాతం నిధులు మాత్రమే ఇస్తుందని, పోలవరంకు మాత్రం 100 శాతం నిధులు ఇస్తుందని చెప్పారు. జల్లికట్టుతో హోదాను పోల్చడం ఏమాత్రం సరికాదన్నారు. జరిగిన ప్రయోజనాలు వదిలి అబద్దాలు ఆడటం సరికాదన్నారు.

సారీ చెప్తున్నా..

జల్లికట్టు, పంది, నంది వ్యాఖ్యల పైన సుజనా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, అందుకు క్షమాపణ చెబుతున్నానని అన్నారు. హోదాకు, పరిశ్రమలకు సంబంధం లేదన్నారు. రాజకీయాలను అభివృద్ధికి లింక్ పెట్టడం సరికాదన్నారు.

తన కంపెనీ రుణం ఎగ్గొట్టిన ఆరోపణలపై..

తన కంపెనీ రుణం ఎగ్గొట్టిన ఆరోపణల పైన సుజన స్పందించారు. తన కంపెనీ ఎప్పుడు అప్పులు ఎగ్గొట్టలేదన్నారు. ఆర్థిక నేరాలు వేరు, ఆర్థిక ఇబ్బందులు వేరని చెప్పారు. తాము ఎన్నో కంపెనీలు పెట్టి ఎన్నో ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. తెలుసుకొని మాట్లాడాలని అభిప్రాయపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+