రుషికొండ ప్యాలెస్ అమ్మితే కొంటా.. చంద్రబాబుకు సుఖేష్ చంద్రశేఖర్ బంపర్ ఆఫర్!!
విశాఖపట్నంలో గత వైసిపి ప్రభుత్వం నిర్మించిన రుషికొండ ప్యాలెస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. సుమారు 560కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత విలాసవంతంగా నిర్మించిన ఈ ప్యాలెస్ ఏపీ వాసులనే కాదు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేస్తుంది. ఇక ఈ నేపథ్యంలో రుషికొండ ప్యాలెస్ తనకు అమ్ముతారా? అంటూ మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైల్లో ఉంటున్న సుఖేష్ చంద్రశేఖర్ చంద్రబాబుకు ఆసక్తికర లేఖ రాశారు.
రుషికొండ భవనాలు నాకు అమ్మండి
వైజాగ్ లోని రుషికొండలో నిర్మించిన అత్యంత ఖరీదైన విలాసవంతమైన ప్యాలెస్ ను తనకు అమ్మాలని, అమ్మడం కుదరకపోతే కనీసం లీజుకైనా ఇవ్వాలి అని ఆయన తన లేఖలో కోరారు. ఈ ప్యాలెస్ కోసం మార్కెట్ ధర కంటే 20% అదనంగా చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు. అలాకాకుంటే ప్రభుత్వం ఎంత ధర ఫిక్స్ చేసినా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

విశాఖతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్న సుఖేష్
తన లేఖను లెటర్ ఆఫ్ ఇంటెంట్ గా పరిగణించాలని చంద్రబాబుకు ఆయన విజ్ఞప్తి చేశారు. తనకు విశాఖపట్నం తో ప్రత్యేకమైన అనుబంధం ఉందని పేర్కొన్న సుఖేష్ చంద్రశేఖర్, తన గ్రాండ్ మదర్ విశాఖకు చెందిన వారనీ, చిన్నతనంలో చాలాసార్లు తాను విశాఖకు వెళ్లానని, విశాఖ బీచ్ లో తాను ఆడుకున్నానని తెలిపారు. రుషికొండ పచ్చదనంతో ప్రకృతి అందాలతో అద్భుతంగా ఉండేదని గుర్తు చేసుకున్నారు.
భవనాలు అమ్మాలనుకున్నా, లీజుకు ఇవ్వాలనుకున్నా నాకే ఇవ్వండి
ఇప్పుడు రుషికొండ భవనాల విషయంలో వివాదం కొనసాగుతున్న కారణంగా భవిష్యత్తులో ప్రభుత్వం ఆ భవనాలను అమ్మాలి అనుకున్నా, లేదా లీజుకు ఇవ్వాలి అనుకున్నా తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని సుఖేష్ చంద్రశేఖర్ కోరారు.ప్రస్తుతం తాను తీహార్ జైల్లో ఉన్నప్పటికీ, తాను ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నానని, తనపై ఏ ఒక్క కేసు నిరూపణ కాలేదన్నారు.
రుషికొండ ప్యాలెస్ ను డెవలప్ చేసి సామాన్యులకు అందిస్తా
సుఖేష్ చంద్రశేఖర్ తన జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నప్పటికీ తన వ్యాపారాలన్నీ సక్సెస్ ఫుల్ గా సాగుతున్నాయని అంతేకాదు తన వ్యాపారాలన్నీ పారదర్శకంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక చెన్నై, గోవా, బార్సిలోనా, దుబాయ్ లలో తన హోటల్ వ్యాపారం సక్సెస్ ఫుల్ గా సాగుతుందని పేర్కొన్న సుకేష్ చంద్రశేఖర్ అదే తరహాలో రుషికొండ ప్యాలెస్ ను కూడా డెవలప్ చేసి సామాన్యులకు అందుబాటులో ఉంచుతానన్నారు.
తన టీం చంద్రబాబును కలుస్తారన్న సుఖేష్
తాను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కారణంగా తనకు పరిమితులు ఉన్నాయని కానీ త్వరలోనే తన టీం పూర్తిస్థాయి వివరాలతో చంద్రబాబును కలుస్తారని లేఖలో వివరించారు. మొత్తానికి ఏపీలో వివాదం రేపుతున్న రుషికొండ భవనాలు విషయంలో సుఖేష్ చంద్రశేఖర్ చంద్రబాబుకు లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications