బ్రాండ్ అంబాసిడర్‌గా హ్యాపీ, రజనీకాంత్ నాకు దేవుడిలాంటివాడు: నటుడు సుమన్
ఏలూరు: స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం ద్వారా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన మన దేశం నిలబడే అర్హత సంపాదించుకోగలదని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన సుమన్ తొలిసారిగా పట్టణానికి మంగళవారం వచ్చారు.
తెలుగుదేశం పారటీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ఆ పార్టీ విధానాలకు, చంద్రబాబు విజన్‌కు ఆకర్షితుడనై పార్టీలో చేరానని సుమన్ అన్నారు. తాడేపల్లిగూడేనికి తనను బ్రాండ్ అంబాసిడర్‌గా తనను నియమించడం సంతోషదాయకమని సుమన్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.

కాగా, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తనకు దేవుడిలాంటి వ్యక్తి అని సుమన్ అన్నారు. కష్టాల్లో ఉన్న మిత్రులకు సాయం చేసే వ్యక్తి రజనీకాంత్ అని, తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రజనీకాంత్ సాయం చేశారని ఆయన చెప్పుకున్నారు. రజనీకాంత్ మార్గాన్నే తాను అనుసరిస్తానని చెప్పారు.
రజనీకాంత్ ప్రోత్సాహంతోనే తాను శివాజీ చిత్రంలో విలన్‌గా నటించి అవార్డు అందుకున్నానని చెప్పారు. అన్నమయ్య చిత్రంలో పోషించిన వెంకటేశ్వరస్వామి పాత్రను ఎన్నిటికీ మరిచిపోలేనని సుమన్ చెప్పారు. స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ పాత్రలు పోషించాలనేది తన కోరిక అని చెప్పారు. మరో 12 ఏళ్ల పాటు సినిమాల్లో నటించాలని ఉందని, దాంతో 50 ఏళ్ల సినీ జీవితం పూర్తవుతుందని సుమన్ చెప్పారు. ఇప్పటి వరకు 400 చిత్రాల్లో నటించినట్లు తెలిపారు.
కరాటే సుమన్‌గా పేరు...
ఇటీవల సమాజంలో చైన్ స్నాచింగ్‌లు, అత్యాచారాలు పెరుగుతున్నాయని, వీటిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఆయన అన్నారు. ఈ దిశగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఈ దిశగా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. కాలేజీ రోజుల్లోనే కరాటేపై మక్కువ పెంచుకున్నానని, ఈ కారణంగానే తమిళనాడులో తనకు కరాటే సుమన్ అనే పేరు వచ్చిందని వివరించారు.












Click it and Unblock the Notifications