పవన్ కల్యాణ్ తో పొత్తుపై బీజేపీ జాతీయ నేత కీలక వ్యాఖ్యలు..!!
బీజేపీ - జనసేన పొత్తు లో కొత్త పరిణామాలు. పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన తరువాత పొత్తుల పైన కీలక చర్చ జరిగింది. 2014 తరహాలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలనేది పవన్ కోరిక. వైసీపీ వ్యతిరేక టు చీలకుండా బాధ్యత తీసుకుంటానని చెప్పిన పవన్ ఆ దిశగా ఈ ప్రతిపాదన బీజేపీ ముఖ్య నేతల వద్ద చేసినట్లు తెలుస్తోంది. దీని పైన బీజేపీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ -జనసేన పొత్తు కొనసాగుతుందని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.
పవన్ కళ్యాణ్ గతంలో బీజేపీ తనకు రోడ్ మ్యాప్ ఇవ్వటం లేదని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో ఒక విధంగా నిర్ణయాలు జరిగితే, రాష్ట్రంలో అవి అమలు కావటం లేదని బీజేపీ ఏపీ నాయకత్వం పైన అసహనం వ్యక్తం చేసారు. వైసీపీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామంటారు, కలిసి రారని పవన్ పేర్కొన్నారు.

ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సునీల్ థియోధర్ ఈ రోడ్ మ్యాప్ గురించి స్పందించారు. రోడ్ మ్యాప్ గురించి పవన్ కల్యాణ్ ను అడగాలని సూచించారు. పవన్ కు ఏమి ఇవ్వాలో అన్ని రోడ్ మ్యాప్ లు ఇచ్చామని చెప్పుకొచ్చారు. తనను కాదు అడగాల్సిందని స్పష్టం చేసారు. ఇప్పటికే సునీల్ థియోధర్ బీజేపీ - వైసీపీ మధ్య బంధం ఉందనే ప్రచారం పైన స్పందించారు.
వైఎస్ భాస్కర రెడ్డిని అరెస్ట్ చేయటం ద్వారా బీజేపీ - వైసీపీ మధ్య ఎటువంటి సంబంధాలు లేవనే విషయం స్పష్టమైందన్నారు. ఏపీలో పాలన పైనా విమర్శలు చేసారు. తాజాగా బీజేపీలో కిరణ్ కుమార్ రెడ్డి చేరిక పైన సునీల్ థియోథర్ స్పందించారు. కిరణ్ చేరిక తరువా ఏపీలో పార్టీలో బలం చేకూరిందని చెప్పుకొచ్చారు. ఓవైసీ వంటి నేతలను అరెస్ట్ చేసిన నేత ఇప్పుడు ఏపీకి అవసరమని చెప్పారు. పవన్ తమతో నే ఉన్నారని స్పష్టం చేసారు.

టిటిడిలో అన్యమతస్తులను ప్రోత్సహిస్తున్నారు.. కొత్త ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇస్తున్నారని ఆరోపించారు. టీటీడీ ఇచ్చిన నోటిఫికేషన్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. రెండు రోజుల్లో నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications