వైయస్ జగన్ అనుచరుడు సునీల్ రెడ్డికి బెయిల్
హైదరాబాద్: ఎమ్మార్ కుంభకోణం కేసులో నిందితుడు సునీల్ రెడ్డికి హైదరాబాదులోని నాంపల్లిలో గల సిబిఐ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. సునీల్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు. సునీల్ రెడ్డికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తమ అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని ఆదేశించింది.
సునీల్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై కోర్టు మంగళవారం, గురువారం విచారణ జరిపింది. ఈ కేసులో సహనిందితుడిగా ఉన్న తుమ్మల రంగారావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సునీల్ రెడ్డిని అక్రమంగా కేసులో ఇరికించారని ఆయన తరఫు న్యాయవాది శ్రీరామ్ వాదించారు. సునీల్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోరారు.

ఎమ్మార్ కేసులో సునీల్ రెడ్డిని పోలీసులు నిరుడు జనవరి 25వ తేదీన అరెస్టు చేశారు. అప్పటి నుంచి కూడా యాయన జ్యుడిషియల్ రిమాండ్‌లోనే ఉన్నారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఐఎఎస్ అధికారితో పాటు ఇతర నిందితులందరికీ కోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని న్యాయవాది శ్రీరామ్ గుర్తు చేశారు.
సునీల్ రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సిబిఐ వాదించింది. ఇరు పక్షాల వాదనలను విన్న తర్వాత కోర్టు సునీల్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల రూపాయల పూచీకత్తు సమర్పించాలని కోర్టు సునీల్ రెడ్డిని ఆదేశించింది. బెయిల్ మంజూరు కావడంతో సునీల్ రెడ్డి సోమవారం చంచల్‌గుడా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications