వివేకా దర్యాప్తు వ్యవహారంలో అనూహ్య పరిణామం, కీలక మలుపు..!!
సంచలనంగా మారిన వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2024 నుంచి ఈ కేసు ఎన్నో మలుపులు తీసుకుంది. హత్య కేసును విచారించిన సీబీఐ నివేదిక సమర్పించింది. అటు సుప్రీం కోర్టులోనూ విచారణ సాగింది. భవిష్యత్ విచారణ విషయంలో అనేక అంశాలు తెర మీదకు వస్తున్నాయి. ఈ సమయంలో వివేకా కూతురు సునీతా రెడ్డి తాజాగా హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ ఆసక్తి కరంగా మారుతోంది.
వివేకా హత్య కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసు లో తదుపరి దర్యాప్తును కొనసాగించేలా కేంద్ర దర్యాప్తు సంస్థకు (CBI) ఆదేశాలు ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను వివేకా కూతురు సునీతా రెడ్డి దాఖలు చేశారు. ఈ కేసులో కొన్ని కోణాలపై సీబీఐ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయలేదని, పలు అనుమానాలకు సమాధానాలు రాలేదని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల మరింత సమగ్ర తదుపరి దర్యాప్తు జరపాలని హైకోర్టును కోరారు. పిటీషన్ లో సునీత పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కాగా.. ఈ కేసు ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తులో ఉంది. గతంలో సీబీఐ కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కొన్ని వ్యక్తుల మధ్య జరిగిన ఫోన్ కాల్ డేటా సహా పలు సాంకేతిక ఆధారాలను పరిశీలించి దర్యాప్తు చేపట్టింది. తదుపరి దర్యాప్తులో కొందరి పాత్ర లేదని పేర్కొంటూ సీబీఐ కోర్టుకు ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేసింది.

పిటీషన్ లో సునీత కీలక అంశాల ప్రస్తావన
కాగా, ఈ దర్యాప్తుపై పిటిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా సునీతా రెడ్డి తన పిటిషన్‌లో పలు కీలక విషయాలను పేర్కొన్నారు. పలు సందేహాలకు సీబీఐ దర్యాప్తులో సమాధానం రాలేదని తెలిపారు. కొన్ని కోణాల్లో విచారణ పూర్తిగా జరగలేదని అన్నారు. ఈ కేసులోని కొన్ని అనుమానా స్పద అంశాలను విస్మరించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అందువల్ల సీబీఐ కోర్టు ఉత్తర్వుల ను రద్దు చేసి, కేసులో ఇంకా స్పష్టత లేని అంశాలపై మరింత దర్యాప్తు చేయాలని ఆదేశించాలని హైకోర్టును అభ్యర్థించారు. కాగా.. ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఈరోజు(సోమవారం) విచారణ జరుగుతోంది. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై రాజకీయ, న్యాయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ తాజా పిటిషన్‌తో వివేకా కేసు దర్యాప్తు మరింత కీలక మలుపు తిరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో.. ఇప్పుడు కోర్టు నిర్ణయం పై ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications