గల్లాకు మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మద్దతు

Super star Krishna supports Galla Jayadev
హైదరాబాద్: గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న తన అల్లుడు గల్లా జయదేవ్‌ను గెలిపించాలని హీరో కృష్ణ అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ నియోజకవర్గం నుంచి గతంలో తాను పోటీ చేయాలనుకున్నానని, కానీ కొన్నికారణాల వల్ల పోటీ చేయలేదన్నారు. ఇప్పుడు తమ కుటుంబం తరఫున గల్లాజయదేవ్ పోటీలో ఉన్నారని తెలిపారు.

పారిశ్రామికవేత్తగా జయదేవ్ ఎంతో పేరుతెచ్చుకున్నారని చెప్పారు. అమర్‌రాజా గ్రూపు అధినేతగా పరిశ్రమలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, పార్లమెంటు సభ్యుడిగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తారని అన్నారు. మంచి ఆశయాలు ఉన్న జయదేవ్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఆదివారం మీడియా సమావేశంలో ఎట్టలేకలకు తన అల్లుడు గల్లా జయదేవ్‌కు కృష్ణ మద్దతు ప్రకటించారు. ఇటీవలే సూపర్‌స్టార్‌ కృష్ణ కుమారుడు ప్రిన్స్‌ మహేష్‌బాబు కూడా తన బావ జయదేవ్‌కే ఓటు వేసి గెలిపించాల్సిందిగా తన అభిమానులను, గుంటూరు ఓటర్లను కోరారు.

సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసుకు మద్దతు ప్రకటించడంతో గల్లా జయదేవ్‌కు మహేష్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ మద్దతు లభించిదని భావించారు. కానీ ఎట్టకేలకు తండ్రీ కొడుకులు ఇరువురు కూడా గల్లా జయదేవ్‌కు విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+