Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమ్మ గురించి మ‌హేష్ బాబు ఏం చెప్పారంటే..

అమ్మంటే నాకు దేవుడితో సమానం.. ఏ సినిమా విడుదలైనా ముందు అమ్మ దగ్గరకు వెళ్లి నేను కాఫీ తాగును.. ఆ కాఫీ తాగిన తర్వాత నాకు దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్లుగా ఉంటుంది.. అందుకే నాకు ఆమె ఆశీస్సులు ముఖ్యం.. మా అమ్మ ఆశీస్సుల వల్లే నాకు ఈ విజయం దక్కింది అని మహర్షి సినిమా సక్సెస్ మీట్ లో మహేష్ బాబు తన తల్లి ఇందిరదేవి గురించి చెప్పారు. ప్రిన్స్ కు తన తల్లి అంటే ఎంత ప్రేమో.. ఎంత గౌరవమో.. వీటిని బట్టే అర్థమవుతాయని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్ చేస్తున్నారు. తెల్లవారుజామున మహేష్ బాబు తల్లి మరణించడంతో ఆ వీడియోను పోస్ట్ చేశారు.

తన తల్లి పట్ల మహేష్ బాబుకున్న ప్రేమను మరోసారి గుర్తుచేసుకుంటన్నారు. #MaheshBabu హ్యాష్‌ట్యాగ్‌ని జత చేస్తూ ధైర్యంగా ఉండండి అన్నా అంటున్నారు. మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమాలో తల్లి సెంటిమెంట్ సీన్ ను కూడా షేర్ చేశారు. ఏప్రిల్ 20వ తేదీ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆరోజు మా అమ్మ పుట్టినరోజని, నేను నటించిన భరత్ అనే నేను చిత్రం విడుదలైందని, అది తనకు ఎంతో ఆనందమని ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోలు అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తున్నాయి.

Famous film actor Mahesh Babu has lost his mother

సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, మహేష్‌ తల్లి ఇందిరాదేవి(70) వేకువ‌జామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం వేకువజామున హైదరాబాద్‌లోని ఇంట్లో క‌న్నుమూశారు. ఇందిరాదేవి మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతిచెందిన వార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, సూపర్‌స్టార్‌ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా సంతాపాన్ని తెలియ‌జేస్తున్నారు. ఇందిరాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఘట్టమనేని కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియ‌జేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+