ఎపిలో షాకిస్తున్న మోడీ, పవన్ కలిస్తే హడలే!(పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోను గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ హవా జోరుగా ఉందని ఆయా పార్టీల సర్వేలలో తేలుతోందట. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు ఎవరికి వారు సొంత సర్వేలు నిర్వహిస్తున్నారు.
ఈ సర్వేల్లో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడవుతున్నాయంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో లోకసభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ప్రాంతంలో అసెంబ్లీకి కాంగ్రెసు, తెరాసలకు ఎక్కువ మంది ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే లోకసభకు మాత్రం బిజెపికి వేయనున్నారు.
సీమాంధ్రలోను అదే పరిస్థితి. సీమాంధ్రలో తెలుగుదేశం లేదా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అసెంబ్లీకి ఓటు వేయాలని ఎక్కువ మంది నిర్ణయించుకున్నారట. అయితే, ఇక్కడా లోకసభకు బిజెపి వైపే ఓటర్లు మొగ్గు చూపుతున్నారట. గతంలో బిజెపి హవా ఎప్పుడు రాష్ట్రంలో ఇంతగా లేదంటున్నారు. మోడీ హవా ఉత్తర భారతంలోనే కాకుండా దక్షిణాదిన కూడా పని చేస్తుందని చెబుతున్నారు. ఎపిలో సరైన ఓటు బ్యాంకు లేని బిజెపి రానున్న ఎన్నికల్లో మోడీ హవాతో కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

నరేంద్ర మోడీ
మేడ్చల్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఇటీవల ఓ సర్వేను కండక్ట్ చేశారట. ఇక్కడ ఎక్కువ మంది అసెంబ్లీకి కాంగ్రెసు పార్టీకి ఓటేస్తామని చెప్పారట. అయితే, లోకసభకు వచ్చేసరికి మోడీ వైపు మరలుతామని చెప్పారట.

నరేంద్ర మోడీ
గతంలో చేసిన ఓ సర్వేలో మోడీకి ఓటేస్తామని చెప్పిన వారు కేవలం మూడుశాతం ఉండగా.. ఈసారి అది ఏకంగా 35 శాతం పెరిగిపోయిందట. ఇది కాంగ్రెసు నేతలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోందంటున్నారు.

నరేంద్ర మోడీ
ఖమ్మం లోకసభ నియోజకవర్గం పరిధిలో జరిపిన ఓ ప్రయివేటు సర్వేలో లోకసభలో బిజెపికి ఓటేస్తామని చెప్పిన వారు సగానికి పైగా ఉన్నారట. అదే సమయంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటేస్తామని చెప్పిన వారు రెండు శాతం వరకే ఉండటం గమనార్హం.

నరేంద్ర మోడీ
గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోను బాగానే ఉందని పలు సర్వేలలో తెలుస్తోందంటున్నారు.

నరేంద్ర మోడీ - పవన్ కళ్యాణ్
ఇప్పటికే మోడీ హవా ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తోందని, ఆయనకు జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోడైతే బిజెపి జోరు మరింత పెరుగుతుందని, అప్పుడు ప్రత్యర్థి పార్టీలకు హడలే అంటున్నారు.












Click it and Unblock the Notifications