అవిశ్వాస తీర్మానంపై టీడీపీకి పెరుగుతున్న మద్దతు, ఎవరెవరు ఓకే అన్నారంటే...
న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ సొంతంగా ప్రవేశపెట్టబోతున్న అవిశ్వాస తీర్మానానికి వివిధ పార్టీల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, ఏఐఏడీఎంకే, వామపక్షాలు, ఎంఐఎం, శివసేన, టీఆర్ఎస్‌లు టీడీపీకి తమ మద్దతు ప్రకటించాయి.
Recommended Video

టీడీపీ నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా స్వాగతించారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించారు. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఇక మద్దతు తెలిపే విషయంలో శివసేన కూడా తమ నిర్ణయాన్ని శుక్రవారం మధ్యాహ్నంలోగా ప్రకటిస్తామని పేర్కొంది.

మరోవైపు కాంగ్రెస్, ఏఐఏడీఎంకే, వామపక్షాలు టీడీపీకి ఇప్పటికే మద్దతు ప్రకటించినట్లు సమాచారం. ఏఐఏడీఎంకేకి లోక్‌సభలో 37 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్‌కు 48 మంది సభ్యులు ఉన్నారు. శివసేన కూడా టీడీపీకి తన మద్దతు ప్రకటించింది.
అయితే టీడీపీ ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానికి మద్దతు ప్రకటించే విషయంలో అకాలీదళ్ ఒక్కటే విభేదించింది. ఈ విషయంలో టీడీపీకి తమ పార్టీ మద్దతు ఇవ్వలేదని ఆ పార్టీ తేల్చి చెప్పింది. అవిశ్వాసంపై తాము దూరంగా ఉండిపోతామని పేర్కొంది.












Click it and Unblock the Notifications