వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ న్యాయమూర్తి ఎన్వీ రమణపై సీఎం జగన్ లేఖ - సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!!

|
Google Oneindia TeluguNews

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్వీ రమణ పై ఏపీ సీఎం రాసిన లేఖ వ్యవహారంపై దాఖలైన పిటీషన్ సుప్రీం విచారణకు వచ్చింది. న్యాయమూర్తి పై చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయవాది సునీల్ కుమార్ సింగ్ సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసారు.జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుందరేశ్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్ పైన విచారణ చేసింది. ఈ పిటీషన్ దాఖలు పైన జస్టిస్ షా పలు ప్రశ్నలు సంధించారు. పిటీషనర్ ఎవరు..ఎందుకు ఈ పిటీషన్ దాఖలు చేసారని ప్రశ్నించారు.

దీనికి సమాధానంగా తాను సీఎం జగన్ ప్రవర్తనను సవాల్ చేసానని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ నాటి సుప్రీం న్యాయమూర్తి పైన చేసిన వ్యాఖ్యలతో అప్పటి సీజేఐకు లేఖ రాసిని విషయాన్ని గుర్తు చేసారు. అదే సమయంలో ఆ విషయాన్ని మీడియాకు చెప్పారని వివరించారు. అన్ని పత్రికల్లో అది వచ్చిందని నివేదించారు. అదే రోజు తాను ఈ పిటీషన్ దాఖలు చేసానని పిటీషనర్ దర్మాసనానికి తెలిపారు. ఇదే సమయంలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి షా ఈ కేసుతో గత ప్రభుత్వ నిర్ణయాల పునసమీక్ష కేసులు ఏంటి సంబంధం అని ప్రశ్నించారు.

Supreme court hearing on Petition filed against CM Jagan letter on Former SC Judge NV Ramana

రెండింటిని ఎందుకు కలిపారంటూ పిటీషనర్ ను సమాధానం రాబట్టారు. గతంలో విచారణకు వచ్చిన సమయంలో నాటి ధర్మానసం చేసిందని, మరో రెండు పిటీషన్లు కొట్టేసి దీనిని మనుగడలో ఉంచారని సింగ్ ధర్మాసనంకు వివరించారు. దీంతో, ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఉందా అంటూ జస్టిస్ షా ప్రశ్నించారు. లేఖ ఉందని చెప్పిన సింగ్, అందులో విషయాలను చెప్పే ప్రయత్నం చేసారు. దీంతో, వెంటనే జోక్యం చేసుకున్న ధర్మాసనం చదవద్దని సూచించింది. దీంతో, గత ప్రభుత్వ నిర్ణయాల పున:సమీక్ష సవాలు కేసు నుంచి ఈ కేసును వేరే చేస్తూ ధర్మానసం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను డిసెంబర్ 12వ తేదీకి ధర్మానసం వాయిదా వేసింది. అప్పట్లో సీఎం జగన్ లేఖ..దేశ వ్యాప్తంగా సంచలనానికి కారణమైంది. ఈ ఫిర్యాదును సుప్రీం కోర్టులోనే గతంలోనే కొట్టివేసింది. ఈ లేఖకు సంబంధించి ఆ తరువాతి కాలంలో రాజకీయంగానూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. సుప్రీం న్యాయమూర్తిగా ఉన్న ఎన్వీ రమణ ఆ తరువాత ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించి కొద్ది నెలల క్రితం పదవీ విరమణ చేసారు.

English summary
Supreme Court gave latet directions on petition filed against CM Jagan complaint on former SC Judge NV Ramana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X