మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగింపు పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!!

మున్సిపల ఎన్నికల నిర్వహణ పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్దులను నామినేషన్ల దాఖలు చేయకుండా అడ్డుకున్నారంటూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘానికి చేసిన సూచనల అమలు.. వైసీపీ వాదనలు.. ప్రభుత్వం తమ అభిప్రాయాలను కోర్టు ముందు ఉంచారు. నామినేషన్ల వివాదాలపై ఎన్నికల పిటిషన్లకు వెళ్లాలని సూచించింది. అదే విధంగా ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

స్థానిక ఎన్నికల ప్రక్రియను రోజువారీగా పర్యవేక్షించాలని హైకోర్టుకు ఆదేశాలు ఇస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. సుప్రీంకోర్టులో ఈ రోజు మున్సిపల్ ఎన్నికల పైన కీలక విచారణ జరిగింది. ఎన్నికల నిర్వహణ పైన కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియను సీసీ కెమేరాలతో పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ దాఖలు చేసిన పిటీషన్ల పైన విచారణ చేసిన సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి కీలక మార్గినిర్దేశం చేసింది.

Supreme Court key decision over YSRCP Plea on Municipal Election Nominations details here

ఇంకా 53 శాతం మంది అభ్యర్ధులు నామినేషన్లు వేసే అవకాశం ఇవ్వలేదని మరోసారి వైసీపీ సుప్రీం కోర్టుకు నివేదించింది. కోర్టు ఆదేశాల మేరకు నామినేషన్ల గడువు పొడిగించామని... ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ తరపు న్యాయ వాదులు వివరించారు. గత విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల అమలుపై రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు సమర్పించాయి.

కాగా.. ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో జరగటం లేదని వైసీపీ తరపు న్యాయవాదులు కోర్టుకు ఫిర్యాదు చేసారు. తమ పార్టీ అభ్యర్థులను పలుచోట్ల నామినేషన్లు వేయనీకుండా అడ్డుకున్నారని వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎక్కడ ఫిర్యాదులు వచ్చాయో అక్కడ పరిశీలన చేసి చెప్పమన్న సంగతిని విచారణ వేళ కోర్టు గుర్తు చేసింది. నామినేషన్ దాఖలు చేసేందుకు తమను అడ్డుకున్నారని భావించే అభ్యర్థులు, తమ వాదనకు తగిన ఆధారాలు ఉంటే చట్టప్రకారం ఎన్నికల పిటిషన్లు దాఖలు చేయవచ్చని ధర్మాసనం పేర్కొంది.

నామినేషన్ల వివాదాలపై ఎన్నికల పిటిషన్లకు వెళ్లాలని సూచించింది. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అదే విధంగా ఎన్నికల ప్రక్రియను రోజువారీగా పర్యవేక్షించాలని హైకోర్టుకు ఆదేశాలు ఇస్తామని కోర్టు వెల్లడించింది. ఆల్ ది బెస్ట్.. ఎన్నికలకు వెళ్లండి అంటూ కోర్టు వ్యాఖ్యానించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+