BC Reservations: ఆ సీట్లు బీసీలకే, స్థానిక పోరులో చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్!

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 105, 1065లను హైకోర్టు కొట్టివేయగా, సుప్రీంకోర్టు కూడా అదే తీర్పును సమర్థించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొండపి సభలో సంచలన ప్రకటన చేశారు. చట్టపరమైన అడ్డంకులు ఎదురైనా, వైసీపీ కుట్రలు పన్నినా సరే.. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ తరఫున బీసీ అభ్యర్థులకు ఖచ్చితంగా 34 శాతం స్థానాలు కేటాయించి రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కోటాను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తీవ్రస్థాయిలో కృషి చేసిందని టీడీపీ వర్గాలు స్పష్టం చేశాయి. హైకోర్టు తీర్పుపై స్వయంగా బీసీ మంత్రులు ఢిల్లీకి వెళ్లి దేశంలోనే అత్యున్నత న్యాయ నిపుణులతో చర్చించి, సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్లను రంగంలోకి దించారు. అయితే, 50 శాతం రిజర్వేషన్ల పరిమితి దాటుతుందనే ఉద్దేశంతో జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ఈ అప్పీల్‌ను తోసిపుచ్చింది. న్యాయస్థానాల ద్వారా అడ్డంకులు వచ్చినా, బీసీ వర్గాలకు పొలిటికల్‌గా అండగా నిలిచే బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

కోర్టు తీర్పుపై కొండపి సభలో స్పందించిన సీఎం

సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంపై ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నర్సింగోలులో జరిగిన 'మీ భూమి-మీ హక్కు' పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చట్టపరమైన అడ్డంకులు ఎదురైనప్పటికీ, బీసీ వర్గాలకు పొలిటికల్‌గా అండగా నిలుస్తామని సీఎం తేల్చిచెప్పారు.

Supreme Court Rejects AP Plea on 34 Percent BC reservations Chandrababu Naidu Promises Party Seats

పార్టీ పరంగా 34 శాతం సీట్లు బీసీలకే!

న్యాయస్థానం జీవోలను కొట్టివేసినా.. కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. చట్టపరంగా రిజర్వేషన్లకు ఆటంకం కలిగినా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీ అభ్యర్థులకు ఖచ్చితంగా 34 శాతం సీట్లు కేటాయిస్తామని సంచలన ప్రకటన చేశారు. ఆనాడు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చింది తెలుగుదేశం పార్టీయేనని, అయితే గత పాలకులు దానిని 24 శాతానికి కుదించి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు.

సుప్రీం కోర్టు తీర్పు - స్థానిక ఎన్నికలకు షెడ్యూల్..!!
సుప్రీం కోర్టు తీర్పు - స్థానిక ఎన్నికలకు షెడ్యూల్..!!

గొడ్డలి పార్టీ కుట్రలను తిప్పికొడతాం!

బీసీలకు ప్రాతినిధ్యం దక్కకూడదనే దుర్బుద్ధితో ప్రతిపక్ష గొడ్డలి పార్టీ కోర్టులను ఆశ్రయించి రిజర్వేషన్లను అడ్డుకుందని సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీసీల పురోగతిని జీర్ణించుకోలేక, ఎన్నికలను సైతం అడ్డుకోవాలనే కుట్రతోనే కేసులు వేశారని విమర్శించారు. గొడ్డలి పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీసీల వెంటే టీడీపీ ఉంటుందని, వారికి రాజకీయంగా తగిన అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.

 స్థానిక ఎన్నికల వేళ పవన్ బిగ్ డెసిషన్, ఏరి కోరి ఎంపిక..!!
స్థానిక ఎన్నికల వేళ పవన్ బిగ్ డెసిషన్, ఏరి కోరి ఎంపిక..!!

నాడు ఎన్టీఆర్ విప్లవం.. నేడు సంక్షేమ పర్వం!

బీసీలకు రాజ్యాధికారం అనే ఆలోచనకు తొలిసారి ప్రాణం పోసి, అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీయేనని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. నాలుగు దశాబ్దాల క్రితం టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు బీసీల గళాన్ని దేశవ్యాప్తంగా వినిపించారని, ఆ తర్వాత 1995లో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను 34 శాతానికి పెంచిన ఘనత కూడా టీడీపీదేనని స్పష్టం చేశారు. కానీ, గత వైసీపీ ప్రభుత్వం బీసీలపై కక్షకట్టి ఆ రిజర్వేషన్లను 24 శాతానికి కుదించడంతో ఏకంగా 16,800 మంది బీసీ నాయకులు తమ పదవులను కోల్పోయారని మండిపడ్డారు. గొడ్డలి పార్టీ కోర్టులకు వెళ్లి బీసీల హక్కులను కాలరాస్తూ మళ్లీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు.

ఆదరణ నుంచి నేతన్న సేవ వరకు.. బీసీల సంక్షేమానికి పెద్దిల్లు!

చేతివృత్తులు, కులవృత్తులపై ఆధారపడిన బీసీ కుటుంబాలను ఆదుకునేందుకు ఆనాడు 'ఆదరణ' పథకం కింద 90 శాతం సబ్సిడీతో 341 రకాల పనిముట్లను అందజేసిన చరిత్ర టీడీపీది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల సంక్షేమానికి మరోసారి భారీ ఊతాన్నిచ్చారు. వడ్డెర్లకు 10 శాతం మైనింగ్ లీజులు, గీత కార్మికులకు 10 శాతం ఎక్సైజ్ షాపులు కేటాయించారు. 'నేతన్న సేవ' కింద ఏడాదికి రూ. 25,000 ఆర్థిక సాయంతో పాటు హ్యాండ్‌లూమ్‌లకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. వేట విరామం సమయంలో 'మత్స్యకారుల సేవ' కింద రూ. 20,000 సాయం అందిస్తూ, గత ప్రభుత్వం తెచ్చిన వివాదాస్పద జీవో నంబర్ 217ను రద్దు చేసి సొసైటీల హక్కులను కాపాడారు. మహిళలకు సీ వీడ్ పెంపకంలో శిక్షణ ఇస్తున్నారు. నాయీ బ్రాహ్మణులు సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణుల భృతిని రూ. 15,000 నుంచి రూ. 25,000కు పెంచడమే కాకుండా స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్‌ను అందుబాటులోకి తెచ్చారు.

పారదర్శక పాలనే మా ధ్యేయం!

ప్రజల బాగుగోలు కోరే కూటమి ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలవాలని ఈ సందర్భంగా చంద్రబాబు కోరారు. తమ పాలన పూర్తిగా పారదర్శకంగా సాగుతోందని, ప్రభుత్వం అందిస్తున్న పౌరసేవలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై నేరుగా ఫోన్ల ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఏవైనా పొరపాట్లు లేదా లోపాలు ఉంటే వెంటవెంటే సరిదిద్దుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+