చంద్రబాబుకు రిలీఫ్ దక్కేనా, నేడే ఆఖరు రోజు - ఉత్కంఠ..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు బయటకు వచ్చేది ఎప్పుడు. చంద్రబాబు కేసులకు సంబంధించి ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది. గత నెల 9వ తేదీన స్కిల్ స్కాంలొ అరెస్ట్ అయిన చంద్రబాబు..అప్పటి నుంచి రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. తాజాగా ఏసీబీ కోర్టు రిమాండ్ ను పొడిగించింది. సుప్రీంలో సుదీర్ఘంగా సాగిన క్వాష్ పిటీషన్ పై తీర్పు రిజర్వ్ అయింది. ఈ రోజు సుప్రీంలో తీసుకొనే నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

బెయిల్ పై విచారణ
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖుల చేసిన ఎస్ఎల్పీ ఈ రోజు సుప్రీంలో విచారణకు రానుంది. తన ముందస్తు బెయిల్ పిటీషన్ ను కొట్టేస్తే ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసులో ఈ నెల 13న విచారణకు వచ్చిన సమయంలో 18వ తేదీ వరకు కోర్టు ఉపశమనం కలిగించింది.

Supreme Court to trail on Chandra Babu bail petition in Fibernet Case today

ఈ కేసుకు 17ఏ వర్తిస్తుందనే లూద్రా వాదించారు. స్కిల్ కేసులో విచారణ పూర్తయిన తరువాత దీని పై విచారిస్తామని చెప్పిన న్యాయమూర్తులు ఈ కేసును 17వ తేదీకి వాయిదా వేసారు. అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో తిరిగి ధర్మాసనం తిరిగి ఈ రోజు ఈ కేసును విచారించనుంది.

క్వాష్ పై ఏం జరగనుంది
ఇదే సమయంలో చంద్రబాబు తొలి నుంచి నమ్మకం పెట్టుకున్న క్వాష్ పిటీషన్ పైన విచారణ పూర్తయింది. హైకోర్టులో కొట్టేసిన క్విష్ పిటీషన్ పైన చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు. చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం తరఫున రెండుగంటలపాటు సాగిన వాదనల్ని విన్న తర్వాత తీర్పును రిజర్వులో ఉంచింది ధర్మాసనం. కానీ.. ఎప్పుడు తీర్పు వెలువరిస్తామన్నది స్పష్టం చెయ్యలేదు.

రేపటి నుంచి ఈనెల 29 వరకు కోర్టుకు దసరా సెలవులు. తీర్పు రిజర్వ్ చేయటంతో ఈ రోజు తీర్పు వెలువరిస్తారనే అంచనాలు ఉన్నాయి. కానీ, ఈ విషయంలో ఈ రోజు లిస్టు కాకపోవటంతో టీడీపీ నేతల్లో మరింత ఉత్కంఠ పెరిగిపోతోంది. నేడు తీర్పు రాకుంటే ఈ నెల 30వ తేదీ వరకు చంద్రబాబు జైలులోనే ఉండాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

కొనసాగుతున్న ఉత్కంఠ
స్కిల్ కేసులో అనితీని నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఏ చంద్రబాబు తరపు న్యాయవాదులు...సీఐడీ తరపు న్యాయవాదుల మధ్య సుదీర్ఘంగా హోరా హోరీ వాదనలు జరిగాయి. న్యాయమూర్తులే పలు ప్రశ్నలు సంధించారు. ఈ కేసులో ఇరు పక్షాలు లిఖిత పూర్వక వాదనలు దాఖలు చేయటానికి ఈ రోజు సుప్రీం చివరి రోజుగా నిర్దేశించింది. రెండు పక్షాల వాదనలు స్వీకరించిన తరువాత న్యాయస్థానం తీర్పు వెలువరించే అవకాశం ఉంది. దీంతో, ఈ రోజునే సుప్రీంలో చోటు చేసుకొనే పరిణామాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+