వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఎగ్జిట్ పోల్స్ లెక్కలకు తిక్కుంది..! పవన్ వ్యూహానికి ఓ లెక్కుందంటున్న జన సైనికులు..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Exit Polls 2019 : ఎగ్జిట్ పోల్స్ తిక్కుంటే..! పవన్ కి ఓ లెక్కుంది : జనసేన..!! || Oneindia Telugu

హైదరాబాద్/అమరావతి : ఏ మాత్రం అంచ‌నాలు లేకుండానే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఏదో రికార్డు సృష్టిస్తాడ‌ని అభిమానులు అంచ‌నా వేసుకున్నారు. వైసీపీ, టీడీపీల‌లో ఎవ‌రికో ఓట‌మి త‌ప్ప‌ద‌ని లెక్క‌లు గ‌ట్టారు. క‌నీసం 30-40 సీట్లు గెలిచి కింగ్‌మేక‌ర్‌గా మార‌తాడ‌ని అంచనాలు పెట్టుకున్నారు. వీరాభిమానులైతే.. ప‌వ‌న్ అను నేను అంటూ గ‌ళ‌మెత్తారు. కానీ.. స‌ర్వేలు, ఎగ్జిట్‌పోల్స్ ఇవేమీ ప‌వ‌న్‌ కళ్యాణ్ ను క‌నీసం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు.. మ‌రో ఆట‌లో అర‌టిపండుగా తీసిపారేసిన‌ట్లుగానే జనసేన పై లెక్క‌లు చూపారు.

 జనసేన ఆటలో అరటిపండు కాదు..! ఆటమ్ బాంబ్ అంటున్న జనసైనికులు..!!

జనసేన ఆటలో అరటిపండు కాదు..! ఆటమ్ బాంబ్ అంటున్న జనసైనికులు..!!

ప‌వ‌న్ గెలుస్తాడా! రెండుచోట్ల నెగ్గి ప‌రువు నిలుపుకుంటాడా! అనే ప్ర‌శ్న‌కు ఇప్ప‌టికీ స‌మాధానం దొర‌క‌లేదు. ఎగ్జిట్ పోల్స్ లో కొన్ని సంస్థ‌లు జన‌సేన కేవ‌లం 1 సీటుకే ప‌రిమితం అంటూ చెప్పుకొచ్చారు. అంటే.. ఈ లెక్క‌న అన్న‌వ‌రం బీమ‌వ‌రంలో ఓడిపోవ‌టం ఖాయ‌మ‌నే సంకేతాలు పంపిన‌ట్టుగానే విప‌క్షాలు లెక్క‌క‌డుతున్నాయి. అన్న నాగ‌బాబు, జేడీ ల‌క్ష్మినారాయ‌ణ ఇద్ద‌రు ఎంపీలుగా విజ‌యం సాధిస్తార‌నుకున్న పాపం.. ఓట‌మి త‌ప్పేలా లేద‌ని ఎగ్జిట్ పోల్స్ బ‌హిర్గ‌తం చేశాయి.

 ఎన్నికల ముందు భారీ అంచనాలు..! పోలింగ్ నాటికి జనసేన మీద తగ్గిన విశ్వసనీయత..!!

ఎన్నికల ముందు భారీ అంచనాలు..! పోలింగ్ నాటికి జనసేన మీద తగ్గిన విశ్వసనీయత..!!

పార్టీలో కీల‌క‌మైన న‌లుగురైదుగురు నేత‌లు గెలిస్తే.. ప‌వ‌న్ ఏదో విధంగా 2024 వ‌ర‌కూ లాక్కు రావ‌చ్చు. అయితే.. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు. అదికార పార్టీ వైపు ప‌క్క‌చూపులు చూడ‌కుండా నిలుప‌టం ప‌వ‌న్ వ‌ల్ల సాధ్య‌మ‌వుతుందా! అనే సందేహాలు కూడా లేక‌పోలేదు. ప్ర‌ముఖ స‌ర్వే సంస్థ‌లు, మీడియా వ్య‌వ‌స్థ‌లు కూడా జ‌న‌సేన‌ను ఏపీలో ప్ర‌త్యామ్నాయ పార్టీగానే చూడ‌లేదు.

 జనసేనను పరిగణలోకి తీసుకోని ఎగ్జిట్ పోల్ సంస్థలు..! ఐనా సత్తా చాటుతామంటున్న జనసైనికులు..!!

జనసేనను పరిగణలోకి తీసుకోని ఎగ్జిట్ పోల్ సంస్థలు..! ఐనా సత్తా చాటుతామంటున్న జనసైనికులు..!!

అది వారి వ్య‌క్తిగ‌త నిర్ణ‌య‌మా! నిజంగానే ఏపీ స‌ర్వేలో బ‌య‌ట‌ప‌డిన అంశ‌మా అనేది క్లారిటీ రాలేక‌పోతుంది. ఎగ్జిట్‌పోల్స్ ఎంత వ‌ర‌కూ నిజ‌మ‌నేది ప‌క్క‌న‌బెడితే.. క‌నీసం.. అనుకూల‌మైన ఒక‌టిరెండు సంస్థ‌ల ద్వారా అయినా ప‌వ‌న్ ఓటింగ్‌ శాతం పై సానుకూలంగా చెప్పించి ఉంటే బావుండేద‌నేది జ‌న‌సైనికుల అభిప్రాయం. అయితే.. తాము పైసా పంచ‌కుండా ఒక్క‌సీటు గెలిచినా గొప్పే అనే భావ‌న‌కు చేరువ‌య్యారు జనసేన నేతలు.

 ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రోకోడైల్ ఫెస్టివల్..! మే 23 తర్వాత మేం ఎంటో తెలుస్తుందంటున్న ఫాన్స్..!!

ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రోకోడైల్ ఫెస్టివల్..! మే 23 తర్వాత మేం ఎంటో తెలుస్తుందంటున్న ఫాన్స్..!!

అయితే ఇది వైరాగ్య‌మా అనే అనుమానాలు కూడా లేక‌పోలేదు. ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే.. ప‌వ‌న్ ఒక్క‌సీటు గెలిచినా.. పార్టీ కేడ‌ర్ ఆయ‌న వెంట ఉంటుంద‌నే దానిపై స్ప‌ష్ట‌త ఉంది. అయితే.. సినిమాలు చేయ‌నంటూ చెప్పిన ప‌వ‌న్‌.. ఐదేళ్ల కాలాన్ని పూర్తిగా ప్ర‌జాజీవితంలో గ‌డుపుతారా! పార్టీని న‌డిపించేందుకు అవ‌స‌ర‌మైన నిధులను ఎలా సేకరిస్తారు..? లేక‌పోతే.. త‌న ఒట్టు తీసి గ‌ట్టున పెట్టి పార్టీ ఫండ్ కోసం నాలుగైదు సినిమాలు అంగీక‌రిస్తారా! అనే అంశంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ మొద‌లైంది. మ‌రి దీనికి ప‌వ‌న్ స‌మాధానం ఎలా ఉండ‌బోతుంద‌నేది మే 23వ తేదీన వెలుపడే ఫలితాల మీద ఆధారపడి ఉందని చెప్పక తప్పదు..!

English summary
Surveys and exit polls did not take into consideration the janasena party.In addition to the BJP and the Congress, Janasena plays nominal role in the ap politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X