అంతర్జాతీయ ప్రమాణాలతో బ్లూఫాగ్ బీచ్ గా ఏపీలోని ఆ బీచ్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి శతవిధాల కృషి చేస్తుంది. ఇందులో భాగంగా బాపట్లలోని సూర్యలంక బీచ్ ను బ్లూ ఫాగ్ బీచ్ గా అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ 2.0 స్కీం కింద సుమారు 97.52 కోట్ల రూపాయల మంజూరు చేయగా, ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

బ్లూ ఫాగ్ బీచ్ గా సూర్యలంక బీచ్

ఏపీలోని సూర్యలంక బీచ్ బ్లూ ఫాగ్ బీచ్ గా అభివృద్ధి చెందితే ఇది పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచే భారతదేశంలోని అత్యుత్తమ బీచ్ లలో ఒకటిగా మారే అవకాశం ఉంది. అసలు బ్లూ ఫాగ్ బీచ్ అంటే ఏమిటి అన్న అంశానికి వస్తే బ్లూ ఫాగ్ సర్టిఫికేషన్ అనేది అంతర్జాతీయ స్థాయి గుర్తింపు. ఇది స్నేహపూర్వకమైన పర్యావరణం, సురక్షితమైన వాతావరణం, అధునాతనమైన సౌకర్యాలు కలిగిన బీచ్ లకు మాత్రమే ఇస్తారు.

suryalanka beach The Centre has sanctioned 98 crore to develop bapatla beach with Blue Flag standards

బ్లూ ఫాగ్ సర్టిఫికేషన్ గుర్తింపు వస్తే అధునాతన టూరిస్ట్ సదుపాయాలు

ప్రస్తుతం మనదేశంలో చాలా తక్కువ బీచ్ లు ఈ గుర్తింపును పొందాయి. ఇక సూర్యలంక బీచ్ కు ఈ గుర్తింపు వస్తే, ఈ జాబితాలో స్థానం దక్కితే ఆంధ్రప్రదేశ్ టూరిజం రంగం భారీగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. బ్లూ ఫాగ్ సర్టిఫికేషన్ గుర్తింపు వస్తే ఇక్కడ అధునాతన టూరిస్టు సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. లైఫ్ గార్డ్స్, సిసి టీవీ, ఎమర్జెన్సీ సపోర్ట్ వంటి సదుపాయాలు వస్తాయి.

బీచ్ షాక్స్, వాటర్ స్పోర్ట్స్ ఇలా ఎన్నో సదుపాయాలు

బీచ్ ఫ్రంట్ డెవలప్మెంట్ సాధ్యమవుతుంది. సైకిల్ ట్రాక్ లు, ప్లాజాలు, వాక్ వే లు అందుబాటులోకి వస్తాయి. ఎకో ఫ్రెండ్లీ స్ట్రక్చర్, గ్రీన్ ఏరియాలు ఏర్పాటు అవుతాయి. లైటింగ్, సీటింగ్, ఫుడ్ కోర్ట్ లు, రిక్రియేషన్ కోర్టులు ఏర్పాటు అవుతాయి. బీచ్ షాక్స్, వాటర్ స్పోర్ట్స్ వంటి సదుపాయాలు కలుగుతాయి.

అమరావతిలో రూ. 150 కోట్లతో మరో వరల్డ్ క్లాస్ ప్రాజెక్ట్!
అమరావతిలో రూ. 150 కోట్లతో మరో వరల్డ్ క్లాస్ ప్రాజెక్ట్!

అంతర్జాతీయంగా పర్యాటకులను ఆకర్షించేలా బాపట్ల బీచ్

బాపట్ల నుంచి సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ బీచ్ గోల్డెన్ శాండ్ తో ప్రసిద్ధి చెందింది. ఇప్పటికే ఫేమస్ అయిన ఈ బీచ్ ను గ్లోబల్ టూరిస్ట్ డెస్టినేషన్ గా తీర్చిదిద్దాలని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. దీనివల్ల టూరిజం అభివృద్ధి చెందడమే కాకుండా, ఆర్థికంగా బలోపేతం అవుతుంది. స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంతర్జాతీయంగా పర్యాటకులను ఆకర్షించే ప్రపంచ స్థాయి బీచ్ గా ఇది మారుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+