• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నీలం సాహ్నీ, డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై సీబీఐ విచారణ: ఏబీ వెంకటేశ్వర రావు సంచలనం..ఆయనకు లేఖ

|

అమరావతి: సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు మరోసారి సంచలనానికి కేంద్రబిందువు అయ్యారు. తనపై వచ్చిన ఆరోపణలపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రామ్ ప్రకాష్ సిసోడియా సారథ్యంలోని విచారణ కమిషన్ ఎదుట హాజరైన ఏబీ వెంకటేశ్వర రావు తాజాగా చేసిన ఆరోపణలు అధికార వర్గంలో కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ, పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్‌ సహా సీనియర్ ఐఎఎస్ అధికారులను ఆయన లక్ష్యంగా చేసుకున్నారు.

వైఎస్ వివేకా హత్యోదంతంతో లింక్: ఏబీ వెంకటేశ్వర రావుపై ముగిసిన విచారణ: 12 పేజీల స్టేట్‌మెంట్

 సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ..

సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ..

ఇదివరకు దర్యాప్తులో భాగంగా తాను అందజేసిన డాక్యుమెంట్లను పోర్జరీ చేశారంటూ విచారణ కమిషన్ ఎదుట హాజరైన ఏబీ వెంకటేశ్వర రావు ఆరోపించిన విషయం తెలిసిందే. ఇప్పడు అవే ఆరోపణలను ఆధారంగా చేసుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు ఆయన లేఖ రాశారు. ఫోర్జరీ ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఫోర్జరీకి గురయ్యారని అనుమానిస్తోన్న డాక్యుమెంట్లను ఆయన తన లేఖకు జత చేశారు. కొందరు సీనియర్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల ప్రమేయం ఉందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. వారి పేర్లను కూడా పొందుపరిచారు.

గౌతమ్ సవాంగ్..సీతారామాంజనేయులు సహా

గౌతమ్ సవాంగ్..సీతారామాంజనేయులు సహా

తన డాక్యుమెంట్లను డీజీపీ గౌతమ్ సవాంగ్ స్వయంగా ఫోర్జరీ, ట్యాంపర్ చేశారని ఏబీ వెంకటేశ్వర రావు ఆరోపించారు. సీఐడీ అదనపు డీజీపీ సునీల్ కుమార్, అవినీతి నిరోధక విభాగం డైరెక్టర్ జనరల్ సీతారామాంజనేయులు, ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌ల ప్రమేయం ఉందని పేర్కొన్నారు. ఇదివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నీలం సాహ్నీ కూడా తనను ఇబ్బందులపాలు చేసేలా ఉత్తర్వులు విడుదల చేశారని ఏబీ వెంకటేశ్వర రావు స్పష్టం చేశారు. నకిలీ డాక్యుమెంట్లను వారు విచారణ కమిషన్‌కు సమర్పించారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించేలా సిఫారసు చేయాలని కోరారు.

విచారణ కమిషన్ వద్ద

విచారణ కమిషన్ వద్ద

ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్‌పై కొనసాగుతోన్న విచారణ ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. ఆయన స్టేట్‌మెంట్‌ను విచారణ కమిషన్ రికార్డ్ చేసింది. రాతపూరకంగా అందజేసిన 12 పేజీల స్టేట్‌‌మెంట్‌ను కమిషన్ నమోదు చేసింది. ఆయన అభిప్రాయాలను తీసుకుంది. ఇక ఈ కమిషన్ తన నివేదికను దేశ అత్యున్నత న్యాయస్థానానికి అందజేస్తుంది. దాన్ని పరిశీలించిన అనంతరం ఏబీ వెంకటేశ్వర రావుపై ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడిస్తుంది. దీనిపై తదుపరి విచారణ వచ్చేనెల 3వ తేదీకి వాయిదా పడింది.

 సస్పెన్షన్‌పై న్యాయపోరాటం..

సస్పెన్షన్‌పై న్యాయపోరాటం..

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. అవినీతి, కుట్రపూరక, దేశద్రోహ కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై జగన్ సర్కార్ ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకుంది. విధుల్లో నుంచి సస్పెండ్ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లోనూ పిటీషన్ దాఖలు చేశారు. ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. వాటిని ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. వాస్తవ పరిస్థితులను వెల్లడించాలని, ఏబీ వెంకటేశ్వర రావు వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, ఓ నివేదికను అందజేయాలంటూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

  #NeelamSawhney Taken Charge as AP New SEC - తొలి మహిళా ఎన్నికల కమిషనర్‌గా రికార్డు !!

  English summary
  Suspended ADGP AB Venkateswara Rao seeks CBI inquiry into alleged forgery and tampering of evidence by DGP Gautam Sawang. In letter to Chief Ssecretary Adityanath, also seeks action against Praveen Prakash, Neelam Sawhney.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X