నన్ను చూసి నవ్వుతున్నారు: నారా లోకేష్ సమక్షంలో భోరుమన్న ఉండవల్లి శ్రీదేవి

బాపట్ల: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవ్వాళ్టికి 183వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఆయన పాదయాత్ర బాపట్ల జిల్లాలో కొనసాగుతోంది. ఈ మధ్యాహ్నం తాడికొండలో ప్రవేశించారాయన. నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు, అమరావతి పరిరక్షణ సమితి నాయకులు కొలికపూడి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే శ్రవణ్.. ఘన స్వాగతం పలికారు.

అనంతరం రాజధాని రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్నారు నారా లోకేష్. రైతుల వెతలను అడిగి తెలుసుకున్నారు. తాము మళ్లీ అధికారంలోకి రాబోతోన్నామని, మళ్లీ అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా కొనసాగిస్తామని ప్రకటించారు. అమరావతి ప్రాంత రైతుల కోసం ఎంతవరకైనా వెళ్తామనీ తేల్చి చెప్పారు.

Suspended YSRCPs MLA Vundavalli Sridevi have participates in Nara Lokeshs Padayatra

ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి. తాడికొండ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న శ్రీదేవి.. వైఎస్ఆర్సీపీ నుంచి సస్పెండ్ అయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో ఆమెపై వేటు వేసింది వైసీపీ అధిష్ఠానం.

దాని తరువాత ఆమె తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపారు. ఇటీవలే శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు. పార్టీలో చేరడానికి ఆసక్తి చూపారు. ఆమె రాకను చంద్రబాబు స్వాగతించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఇస్తాననే హామీ సైతం ఇచ్చారు.

Suspended YSRCPs MLA Vundavalli Sridevi have participates in Nara Lokeshs Padayatra

చంద్రబాబు నుంచి టికెట్ హామీ దక్కిన నేపథ్యంలో- ఇక నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు. ముఖాముఖిలో ప్రసంగించారు. నారా లోకేష్ సమక్షంలో కన్నీరు పెట్టుకున్నారు. రాజధాని లేని నగరానికి శాసన సభ్యురాలినంటూ అందరూ తనను చూసి నవ్వుతున్నారని వాపోయారు. వైసీపీది నిరంకుశ పాలనగా అభివర్ణించారు.

ఇకపై తన భరోసా మొత్తం నారా లోకేష్‌దేనని తేల్చి చెప్పారు ఉండవల్లి శ్రీదేవి. నారా లోకేష్, నారా చంద్రబాబు ఇచ్చిన ధైర్యంతో మాట్లాడుతున్నానని, వైఎస్ఆర్సీపీ నాయకులను హెచ్చరిస్తోన్నానని చెప్పారు. అమరావతి ప్రాంత రైతులను నిరంకుశ ప్రభుత్వం ఎంతగానో హింసించిందని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+