జనసేన, బీజేపీలో ఆ పదవి దక్కేదెవరికి - చంద్రబాబు ఛాయిస్..!!

ఏపీలో కొత్త ప్రభుత్వంలో అసెంబ్లీ కొలువు తీరింది. సభ్యుల ప్రమాణ స్వీకారం..స్పీకర ఎన్నిక పూర్తయింది. ఈ నెల 24న తొలి మంత్రివర్గ సమావేశం జరగనుంది. పాలనా పరంగా ఈ భేటీలో లక్ష్యాలను డిసైడ్ చేయనున్నారు. ఇక..అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పదవి ఎంపిక పైన సస్పెన్స్ కొనసాగుతోంది. మూడు పార్టీల్లో ఎవరికి ఈ పదవి దక్కుతుందనేది చర్చగా మారుతోంది. చంద్రబాబు - పవన్ తుది నిర్ణయం పైన ప్రకటన చేయాల్సి ఉంది.

డిప్యూటీ దక్కేదెవరికి
మూడు పార్టీల కూటమి ప్రభుత్వంలో పదవులు ఒక్కోక్కటి ఖరారు చేస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్ పదవి ఉత్తరాంధ్ర బీసీ వర్గానికి చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడుకు కేటాయించారు. స్పీకర్ పదవి టీడీపీకి దక్కటంతో డిప్యూటీ స్పీకర్ జనసేనకు ఇస్తారని భావిస్తున్నారు. జనసేన నుంచి మంత్రివర్గంలో స్థానం దక్కని సామాజిక వర్గాలకు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో, విజయనగరం నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి పేరు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, స్పీకర పదవి ఉత్తరాంధ్రకు ఇవ్వటంతో..అదే ప్రాంతానికి చెందిన వారికి డిప్యూటీ ఇస్తారా అనేది సందేహంగా మారుతోంది.

Suspense continues on AP Assembly deputy speaker who will get Chance

రేసులో సీనియర్లు
దీంతో..మరో మిత్రపక్షం బీజేపీకి కేటాయించటం పైన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి సుజనా చౌదరి, నల్లిమిల్లి రామక్రిష్ణారెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. అదే విధంగా టీడీపీ నుంచి ఇద్దరి పేర్లు చర్చలో ఉన్నాయి. రఘురామ రాజు కు డిప్యూటీగా అవకాశం ఇస్తారనే అంచనాలు ఉన్నాయి. క్షత్రియ వర్గానికి మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు. దీంతో, రఘరామ రాజుకు డిప్యూటీ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ పార్టీలో ఉంది. తాజాగా రాయలసీమకు చెందిన టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసుల పేరు తెర మీదకు వచ్చింది.

తుది కసరత్తు
దీంతో..డిప్యూటీ స్పీకర్ పదవి విషయంలో ఇప్పుడు చంద్రబాబు - పవన్ నిర్ణయం ఏంటనేది కీలకంగా మారుతోంది. డిప్యూటీ స్పీకర్ తో పాటుగా చీఫ్ విప్ గా దూళిపాళ్ల నరేంద్రకుమార్ విప్ లుగా మూడు పార్టీల నుంచి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక..ప్రతిపక్ష పార్టీకి దక్కాల్సిన పీఏసీ ఛైర్మన్ పదవి విషయంలోనూ నిర్ణయం ఆసక్తి కరంగా మారింది. వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కకపోవటం తో వైసీపీకి ఈ పదవి ఇస్తారా..మిత్రపక్షాలకే చంద్రబాబు కేటాయిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+