Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !!

ఏపీలోని పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన పారిశుద్ధ్య కార్మికుల శిక్షణ కార్యక్రమంలో జరిగిన ఒక సంఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన టీడీపీ నేత, నియోజకవర్గ ఇన్‌చార్జ్ SVSN Varma మున్సిపల్ అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కార్యక్రమం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు.
అయితే ఈ ఘటనకు కారణం స్టేజ్‌పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అని తెలుస్తోంది. ఆ ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దగా ఉండగా, సీఎం నారా చంద్రబాబు ఫోటో చిన్నగా ఉండటం వర్మను ఆగ్రహానికి గురి చేసింది.

కాగా ముఖ్యమంత్రి చిత్రానికి గౌరవం ఇవ్వకుండా ఇలా చేయడం సరైంది కాదని ఆయన మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. "చంద్రబాబుకు గౌరవం లేని చోట తాము ఎందుకు ఉండాలి?" అంటూ అసహనం వ్యక్తం చేస్తూ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటన సమయంలో వేదికపై జనసేన పార్టీ నాయకులు కూడా ఉన్నారు. అయితే వర్మ ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు వారు ఎవరూ స్పందించకపోవడం గమనార్హంగా మారింది. దీంతో ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

tdp-leader-svsn-varma-fire-on-officials-over-cm-chandrababu-naidu-and-pawan-kalyan-images-in-flex-at

ఇక పిఠాపురం రాజకీయాల్లో ఇప్పటికే టీడీపీ-జనసేన మధ్య విభేదాలు ఉన్నాయనే చర్చ చాలాకాలంగా కొనసాగుతోంది. గత ఎన్నికల సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయం కోసం టీడీపీ నేత వర్మ కీలకంగా పనిచేశారు. ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తన గెలుపు బాధ్యతలను వర్మ భుజాలపై పెట్టినట్టు ప్రకటించారు. అయితే ఎన్నికల తర్వాత పరిస్థితులు మారిపోయాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి.

ఈ నేపథ్యంలో గతంలో కూడా వర్మ చేసిన కొన్ని వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులు పెద్ద చర్చకు దారితీశాయి. గత ఏడాది ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక వీడియో పోస్టు చేయడం సంచలనం సృష్టించింది. "కష్టపడి సాధించే విజయానికి గౌరవం" అనే క్యాప్షన్‌తో విడుదలైన ఆ వీడియోలో ఎన్నికల ప్రచారంలో తాను చేసిన కార్యక్రమాలను చూపించారు. అయితే ఆ వీడియోలో ఎక్కడా పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడం వివాదానికి దారి తీసింది. దీనిపై వివరణ ఇచ్చిన వర్మ, తన సోషల్ మీడియా అకౌంట్‌ను హైదరాబాద్‌కు చెందిన ఒక సంస్థ నిర్వహిస్తోందని తెలిపారు. తన అనుమతి లేకుండా ఆ వీడియో పోస్టు చేయబడిందని, విషయం తెలుసుకున్న వెంటనే దాన్ని తొలగించించానని చెప్పారు. భవిష్యత్తులో తన అనుమతి లేకుండా తప్పుడు పోస్టులు చేస్తే చర్యలు తీసుకుంటానని కూడా హెచ్చరించారు.

ఇదిలా ఉండగా, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నేతలు అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తున్నారని వర్మ గతంలో ఆరోపణలు చేసిన సంగతి కూడా అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. దీనికి సంబంధించి సాక్ష్యాలు కూడా బయటపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. తాజాగా జరిగిన ఈ ప్లెక్సీ వివాదం మరోసారి పిఠాపురం రాజకీయాలను వేడెక్కించింది. టీడీపీ, జనసేన మధ్య అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. ఇకపై ఈ వ్యవహారం ఎలా మలుపు తిరుగుతుందో అన్నదానిపై స్థానిక రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+