బాబు గోగినేని ఉన్మాది అయితే కత్తి మహేష్‌ దానికి పరాకాష్ట:పరిపూర్ణానంద స్వామి సంచలనం

తిరుపతి: ఇటీవలి కాలంలో రాష్ట్రంలో ఎవ్వరినో ఒకరిని వివాదాల్లోకి లాగి, సంచలనాలు చేస్తూ బతికే వారు ఎక్కువ అయ్యారని...అందులో బాబు గోగినేని ఉన్మాది అయితే కత్తి మహేష్‌ దానికి పరాకాష్ఠని స్వామి పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు చేశారు.

Recommended Video

    Bigg Boss Season 2 Telugu : Complaint Filed Against Babu Gogineni

    సోమవారం తిరుపతిలో పరిపుర్ణానంద స్వామి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని గౌరవించి ప్రతి ఒక్కరు బాధ్యతగా ప్రవర్తించాలన్నారు. వాక్‌ స్వాతంత్రాన్ని తప్పుదోవ పట్టించకూడదని హితవు పలికారు. కత్తి మహేష్ రామాయణాన్ని, మహాభారతాన్ని ఒక కథ అని వ్యాఖ్యనించడం బాధాకరమన్నారు.

    Swami Paripoornananda Fires On Kathi Mahesh Over His Comments

    కత్తి మహేష్‌ ఎవ్వరికో అమ్ముడుబోయాడని, అతను హిందువు కాదు, మరి మా పవిత్ర హిందూ గ్రంథాలపై ఎలా కామెంట్‌ చేస్తాడని పరిపూర్ణానంద స్వామి ప్రశ్నించారు. కత్తి మహేష్‌ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాని...తెలంగాణా ప్రభుత్వం కాని వెంటనే అరెస్టు చేయాలని స్వామి పరిపూర్ణానంద డిమాండ్‌ చేశారు. కత్తి మహేష్ చేత హిందువులకు క్షమాపణ చెప్పించాలన్నారు. లేని పక్షంలో ప్రభుత్వాలు హిందువుల ఆగ్రహానికి గురవుతాయి అని ఆయన హెచ్చరించారు.

    "కత్తి మహేష్‌ కు అంతగా అవసరం అయితే ముస్లిం, క్రిస్టియన్‌ గ్రంథాలపై కామెంట్‌ చేసుకోమనండి...మా హిందు దేవుళ్ళు, దేవతలు, గ్రంథాల జోలికి వస్తే ఖచ్చితంగా సహించేది లేదు"...అని పరిపూర్ణానంద తేల్చి చెప్పారు. మేము నమ్ముకున్న గ్రంథాలను, దేవుళ్ళను మేము విశ్వసిస్తాం. కత్తి మహేష్‌ లాంటి నాస్తికులు వెళ్ళి గంగలో దూకండి అని పరిపూర్ణానంద స్వామి మండిపడ్డారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+