5 లక్షల కోట్ల విలువగల భూములు అన్యాక్రాంతం, సీఎం జగన్‌కు స్వామి పరిపూర్ణానంద లేఖ
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విక్రయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కితగ్గడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. హిందువుల మనోభావాల మేరకు ప్రభుత్వం వెనక్కి తగ్గిందని స్వాములు కూడా అభిప్రాయపడుతున్నారు. టీటీడీ ఆస్తుల వేలంపై విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి సీఎం జగన్మోహన్ రెడ్డికి సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఆ మరునాడు స్వామి పరిపూర్ణానంద ముందుకొచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

థాంక్స్..
టీటీడీ ఆస్తుల వేలం వేయకుండా నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు అంటూ స్వామి పరిపూర్ణానంద లేఖ ప్రారంభమైంది. ఇదివరకు పనిచేసిన ముఖ్యమంత్రులు హిందువుల కోసం ఏమీ చేయలేదని విమర్శించారు. వారు పేరుకు హిందువులుగా చెలామణి అయ్యారే తప్ప హిందు సమాజం కోసం ఏం చేయలేదని పేర్కొన్నారు. ఆలయాలు, మఠ మందిరాలకు, గోవులు, గోశాలలకు ఏమీ చేయలేదని గుర్తుచేశారు. కానీ ఆలయా భూములను మాత్రం అనుయాయులకు కట్టబెట్టారని తెలిపారు.

5 లక్షల కోట్ల విలువగల భూములు..
గత పాలకులు చేసిన చర్యతో 5 లక్షల కోట్ల విలువ గల పంట భూములు, విలువైన స్థలాలు కనుమరగయ్యాయని తెలిపారు. ఆభరణాలు, భక్తుల కానుకలను కూడా వదలలేరు అని గుర్తుచేశారు. ఆలయాలకు చెందిన భూములు, కానుకలపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం జగన్‌ను కోరారు. భక్తులు అందజేసిన నగలు, ఆభరణాలను గోప్యంగా ఉంచాల్సిన అవసరం లేదు అని అభిప్రాయపడ్డారు. భక్తులు అందజేసిన కానుకల వివరాలను ప్రజలకు తెలియజేయడం వల్ల ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసం మరింత పెరుగుతుందని సూచించారు.
Recommended Video

చరిత్రలో నిలచిపోతారు..
గతంలో ఏ సీఎం చేయని పని చేసినవారవుతారని.. హిందు సమాజం నమ్మకం రెట్టింపవుతోందని సూచించారు. మీకు ఓటువేసిన హిందువులకు న్యాయం చేసే అవకాశం లభించిందని అనుకోవాలని కోరారు. ఈ పని చేయడం వల్ల చరిత్రలో మిగలిపోతారని స్వామి పరిపూర్ణనంద తెలిపారు. దీంతో ప్రభుత్వానికి మరింత మంచి పేరు వస్తుందని.. భూములు, కానుకల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications