జగన్ రాజ గురువు తాజా నిర్ణయం వెనుక..!!
విశాఖ శారదా పీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. ఇక, ఎక్కువ కాలం రుషికేశ్ లో గడపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్వరూపానందేంద్ర ను రాజగురువుగా కొందరు అభివర్ణించే వారు. ఆయనకు ప్రభుత్వం భద్రత.. భూ కేటాయింపుల విషయంలో ప్రాధాన్యత ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భూ కేటాయింపులు రద్దు చేసింది. తాజాగా స్వరూపానందేంద్ర నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది.
విశాఖ శారదా పీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర ఏపీని కాదని రుషికేష్ లో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ హయాంలో స్వరూపానందేంద్రకు అధిక ప్రాధాన్యత ఉండేది. ఇద్దరు మాజీ సీఎంలకు స్వామిజీ అంటే అపారమైన నమ్మకంతో ఉండేవారు. ఇద్దరితోనూ రాజ శ్యామల యాగం చేయించారు. ఇద్దరూ విశాఖలోని శారదా పీఠం సందర్శించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శారదా పీఠం కు భూములు కేటాయించారు. స్వరూపానందేంద్రకు వై క్యాటగిరీ భద్రత కల్పించారు.

ఇప్పుడు తాజాగా స్వరూపానందేంద్రకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎక్స్ క్యాటగిరీ భద్రతను ఉపసంహరించుకోవాలని విశాఖ శారదా పీఠం పీఠం మేనేజర్ ఏపీ డీజీపీకి లేఖ రాసారు. ఇక పై స్వరూపానందేంద్ర రుషికేశ్‌లో తపస్సులో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నారని తెలియజేశారు. వైసీపీ హయాంలో స్వరూపానందేంద్రతో పాటు ఉత్తరాధికారికీ ఓ గన్‌మెన్ ఉండేవారు. స్వామిజీ ఎక్కడికి వెళ్లినా ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేవారు. కూటమి అధికారంలోకి వచ్చాక వై క్యాటగిరీ భద్రత నిలిపివేసింది. ప్రస్తుతం వారికి వన్ ప్లస్ వన్ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.
వైసీపీ హయాంలో శారదా పీఠానికి రూ. 300 కోట్ల విలువ చేసే భూమిని కేవలం రూ. 15 లక్షలకే అప్పగించారనే అభియోగాలు ఉన్నాయి. దీంతో, తాజాగా కూటమి ప్రభుత్వం ఆ కేటాయింపులను రద్దు చేసింది. వరుస నిర్ణయాల వేళ ఇప్పుడు స్వరూపానందేంద్ర స్వామిజీ నిర్ణయం.. అదే విధంగా పీఠం తాజా లేఖ పైన చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications