సీఎంలు కేసీఆర్ - జగన్ జాతకాలు ఈ ఏడాది ఇలా : స్వరూపానందేంద్ర ..!!

స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాతకం ఎలా ఉండబోతుందనేది వివరించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉగాది పంచాగ శ్రవణం నిర్వహిస్తున్నారు. అన్ని దేవాలయాలు..పీఠాలతో పాటుగా రాజకీయ పార్టీల కార్యాలయాల్లోనూ ఆసక్తిగా ఈ ఏడాది రాశి ఫలితాలు తెలుసుకోవటానికి నేతలు నిరీక్షిస్తున్నారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ రాజకీయ నేతల గురించి పంచాంగ శ్రవణంలో ప్రముఖ పీఠాధిపతులు చెప్పే అంశాలకు ప్రాధాన్య ఉంది. అందులో భాగంగానే.. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాతకం ఎలా ఉండబోతుందనేది వివరించారు.

విశాఖ శ్రీ శారదా పీఠంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పీఠం గంటల పంచాంగాన్ని శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఏడాది తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది విశ్లేషించారు. ప్రధాని మోదీతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి కేసీఆర్ - జగన్ గురించి ఆసక్తి కర అంశాలు వెల్లడించారు. కాల సర్ప దోషం కారణంగా మూడేళ్లుగా దేశం ఇబ్బందులు పడినట్లు స్వరూపానందేంద్ర తెలిపారు. ఈ ఏడాది చతుర్ గ్రహ కూటమితో కొత్త సంవత్సరం ప్రారంభమవుతోందని.. దీని వల్ల దేశానికి ఇబ్బందులు తప్పవన్నారు. ప్రధానితో పాటుగా.., తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్న ఇద్దరు ముఖ్యమంత్రుల జాతకాలు బాగుండటంతో కొంతవరకు ఇబ్బందులు తొలగుతాయన్నారు.

Swaroopanandendra Saraswathi Reveals new telugu year Panchangam predictions on Both Telugu states CMs

ఉత్తరాదిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయని చెప్పారు. దేశమంతటా వాహన ప్రమాదాలు అధికమవుతాయన్నారు. ఎండలు, వడ దెబ్బలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. జూలై నుంచి సెప్టెంబరు వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు కొనసాగుతాయని వివరించారు. రెండు తెలుగు ప్రభుత్వాలు అధికారికంగా ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించాయి. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం ఉగాది ఉత్సవాలను నిర్వహించింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ నివాసంలోని గోశాలలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీవెంకటేశ్వర ఆలయంలో సీఎం వైయ‌స్‌ జగన్‌ దంపతులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పంచాంగాన్ని సీఎం వైయ‌స్ జగన్‌ ఆవిష్కరించారు. అనంతరం పంచాంగ శ్రవణంలో సీఎం జగన్‌ దంపతులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+