రూమీ: శ్వేత బసు మంచి ఫొటోగ్రాఫర్ కూడా...
హైదరాబాద్: ఓ అవాంఛనీయమైన సంఘటనతో వార్తల్లో నానుతున్న కొత్త బంగారు లోకం సినిమా హీరోయిన్ శ్వేతబసు ప్రసాద్ మంచి ఫొటోగ్రాఫర్ కూడా. రూమీ అనే పర్షియన్ కవికి ఆమె అభిమాని అని కూడా తెలుస్తోంది. హైదరాబాదులోని మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో ఆమె గతంలో తాను తీసిన ఫొటోలతో ఓ ప్రదర్శన నిర్వహించింది.
దైనందిన జీవితానికి, ప్రకృతికి సంబంధించి ఆమె అందమైన ఛాయాచిత్రాలు తీసింది. తన షోకు ఆమె రూమీ అని పేరు పెట్టుకుంది. ప్రతి ఫోటో కింద రూమీ స్టాంజాలను ఇచ్చారు. 2012 నవంబర్‌లో ఆమె ఛాయాచిత్రాల ప్రదర్శన జరిగింది.

సినీ పరిశ్రమకు రాక ముందు ఆమెకు ఫొటోగ్రఫీ ఓ హ్యాబీ, ఫ్యాషన్ కూడా. పర్యటనలకు వెళ్లినప్పుడు సరదాగా అహ్లాదకరమైన చిత్రాలను తన కెనన్ డి 1000 కెమెరాలో బంధించారు. శ్వేత కుటుంబ సభ్యులు ఆ చిత్రప్రదర్శనను ప్రారంభించారు.
రూమీ 13వ శతాబ్దానికి చెందిన కవి. ఆయన రచనలు తనకు ఎంతో ఇష్టమని ఆమె అప్పట్లో చెప్పారు. రూమీ 805వ పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫోటో ప్రదర్శనను పెట్టారు. ఈ ఫొటోగ్రఫీ ప్రదర్శనకు వచ్చిన డబ్బును హీల్ చిల్డ్రన్ చారిటీకి విరాళంగా ఇచ్చారు.












Click it and Unblock the Notifications