పద్ధతి ప్రకారమే: టిపై కమల్, కిరణ్ పోతే చిరంజీవి:డొక్కా

సొంత మంత్రులను నియంత్రించలేక పోతున్నారు: అసద్
సొంత పార్టీ కేంద్ర మంత్రులను ప్రధాని మన్మోహన్ సింగ్ లోకసభలో నియంత్రించడం లేకపోతన్నారని మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. తెలంగాణ బిల్లుకు మంత్రి జెడి శీలం రాజ్యసభలో సవరణలు ప్రతిపాదించడానికి కాంగ్రెస్ అనుమతినిస్తుందా? అని ప్రశ్నించారు.
కిరణ్ పోతేనేం.. చిరు ఉన్నారు: డొక్కా
కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తే నష్టమేమీ లేదని, తమకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఉన్నారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ అన్నారు. కిరణ్ కొత్త పార్టీని పెట్టరని తాను భావిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర విభజనకు కిరణ్ కారణమన్నారు. కిరణ్ విభజనకు సహకరిస్తూ సీమాంధ్ర ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఇన్నాళ్లు ఆయన మంత్రివర్గంలో పని చేయనిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
జగన్, కిరణ్‌లపై యనమల
విభజన అంశంలో కిరణ్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిల నాటకాలకు తెరపడనుందని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ 2013 జులైకు ముందు బొత్స, దామోదరలతో కలసి విభజనకు రోడ్ మ్యాప్ రూపొందించింది కిరణే అన్నారు. ఇప్పుడు ఎవరిని ఉద్దరించడానికి రాజీనామా నాటకాలు ఆడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications