టి బిల్లు: సిఎస్‌కు హరీష్ వార్నింగ్, భయమొద్దని టిజి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లుగా వింటున్నారన్నారు. తమ హక్కులకు భంగం వాటిల్లుతోందన్నారు. సభా గౌరవాన్ని స్పీకర్ కాపాడాలని కోరారు. తెలంగాణ ముసాయిదా బిల్లును వెంటనే ప్రవేశ పెట్టాలని, చర్చ ఈరోజే జరపాలన్నారు.
ఈ రోజు తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి రాకుంటే తాము సాయంత్రం లేదా సోమవారం సిఎస్ పైన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సభ జరుగుతున్నప్పుడు బిల్లు పంపించేందుకు కాలయాపన చేయడం సరికాదన్నారు. కిరణ్ సీమాంధ్ర ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారని, 371 డి కేంద్రానికి సంబంధించిన అంశమన్నారు.
సీమాంధ్ర ప్రజలు భయపడొద్దు: టిజి
వచ్చే ఎన్నికలలోపు రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లో జరగదని, సీమాంధ్ర ప్రాంత ప్రజలు భయపడవద్దని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ అంతకుముందు అన్నారు. పార్లమెంటులో 371 డిపై సవరణ జరిగితేనే విభజన ప్రక్రియ ముందుకు పోతుందన్నారు. దానికి పార్లమెంటులో రెండొంతుల మెజార్టీ కావాలని, దానికి ఇతర రాష్ట్రాలు సిద్ధంగా లేవని చెప్పారు.
స్పీకర్ మౌనం
సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు సభాపతి నాదెండ్ల మనోహర్‌ను కలిసి తెలంగాణ బిల్లు రాజ్యాంగ విరుద్దమని, దానిని సభలో పెట్టకుండా వెనక్కి తిప్పి పంపాలని కోరారు. దానికి మనోహర్ మౌనం వహించారు.












Click it and Unblock the Notifications