జేసీ ప్రభాకర్ రెడ్డి నిరాహార దీక్ష.. తన ప్రవర్తనపై తానే నిరసన

న్యూ ఇయర్ వెళ తాడిపత్రిలో టెన్షన్ నెలకొంది. టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరాహార దీక్షకు దిగారు. గాంధీ బొమ్మ సెంటర్లో టెంట్ వేసుకుని దీక్షకు కూర్చున్నారు. టాపిక్ ఏదైనా సరే.. మొహమాటం లేకుండా ముక్కు సూటిగా మాట్లాడే జేసీ ప్రభాకర్ రెడ్డికి అధికార ప్రతిపక్ష తేడా లేదు. తాను ఏదనుకుంటే అదే చేసి తీరుతారు. ఇప్పుడు తన కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్న తాడిపత్రిలో ఆయన మున్సిపల్ చైర్మన్ గా ఉంటూ నిరాహార దీక్షకు దిగడం ఏంటి? తాడిపత్రిలో ఏం జరుగుతుంది.

టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరాహార దీక్షకు దిగారు. తన ప్రవర్తనపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అసలు తాను అలా ఎందుకు ప్రవర్తించాల్సి వస్తుందో వివరించేందుకే గురువారం తాడిపత్రిలో నిరాహార దీక్ష చేపట్టారు. గాంధీ బొమ్మ సెంటర్ టెంట్ వేసుకుని కూర్చున్న ఆయన తన మనసులోని అభిప్రాయాలను ప్రజలకు తెలియజేయాలనే దీక్ష చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల అభిప్రాయం మేరకే తన ప్రవర్తనను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. 2026 నాటికి తాడిపత్రిని మరింత అభివృద్ధి చేయాలనే తన కోరికను కూడా ఆయన వ్యక్తం చేశారు.

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా తాను ఎంత నిధులు ఖర్చు చేశాను, ఏఏ అభివృద్ధి పనులకు ఎంత వెచ్చించాను అనే అంశాలను ఫెక్సీలు ఏర్పాటు చేసి మరీ వివరించారు. ప్రజలకు ఏమైనా సందేహాలుంటే తనను నేరుగా సంప్రదించేందుకు ఫోన్ ద్వారా కూడా అందుబాటులో ఉంటా.. వారు అడిగే ప్రతి రూపాయికి లెక్క చెప్తా అన్నారు. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలే తనకు అందరికంటే ముఖ్యం అన్నారు.

Tadipatri Municipal Chairman JC Prabhakar Reddy Begins Hunger Strike in Tadipatri to Explain His Conduct
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+