వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'బాలకృష్ణా! కాస్త ఓపిక పట్టు, నీకే ఛాన్స్': కేసీఆర్ 'సినిమా' వ్యాఖ్య హాట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. బాలయ్యా.. కాస్త ఓపిక పట్టు నీకే అవకాశమని ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. ఇప్పటికే కేసీఆర్ వ్యాఖ్యలు హాట్ హాట్‌గా మారాయి.

తాజాగా, తలసాని వ్యాఖ్యలతో మరింత హీటెక్కింది. తలసాని మాట్లాడుతూ.. చంద్రబాబు మాటలు చాలా సిల్లీగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఏపీ పోలీసులను పెట్టుకున్న చంద్రబాబు.. నీరు, విద్యుత్ కూడా అక్కడి నుండే తెచ్చుకుంటారా అని ప్రశ్నించారు.

బాలయ్యా కాస్త ఓపిక, అవకాశం నీకే అన్నారు. ఫోన్లు ట్యాప్ చేయాల్సిన గత్యంతరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టపరంగా సమాధానం చెప్పే పరిస్థితి వస్తుందన్నారు. చంద్రబాబు ఇప్పటికీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు.

Talasani says next chance to Balakrishna, he should wait for some time

కేసీఆర్ వ్యాఖ్యలపై హాట్ హాట్...

ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చర్చకు తెరలేపాయి. రూ.150 కోట్లతో ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో ఇంకా చాలా అంశాలన్నాయని చెప్పారు. చంద్రబాబుకు సంబంధించి సినిమా ఇంకా ఉందన్నారు.

సమయం వచ్చినప్పుడు కేసీఆర్ బండారం: కేఈ

సమయం వచ్చినప్పుడు తాము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బండారం బయట పెడతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. కేసీఆర్, జగన్‌లు కలిసి టీడీపీ పైన రాళ్లు విసిరే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

English summary
Talasani says next chance to Balakrishna, he should wait for some time
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X