కేసీఆర్‌తో భేటీ: తలసాని సహా 4గురు ఎమ్మెల్యేల షాక్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును గురువారం ఉదయం పలువురు తెలంగాణ టీడీపీ నేతలు క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ కేసీఆర్‌ను కలిశారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో తలసాని, తీగలతో పాటు పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్‌లు ఉన్నారు.

వీరు మరికొద్దిసేపట్లో అధికారికంగా తాము తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. తెలంగాణ టీడీపీలో తెలంగాణవాదులు ఉన్నారని, అలాంటి వారు టీడీపీని వీడాలని, కొద్ది రోజుల్లో తమ పార్టీలోకి పలువురు తెలంగాణ టీడీపీ నేతలు వస్తారని కొద్ది రోజులుగా తెరాస నాయకులు చెబుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications