చంద్రబాబు, పవన్ తో సీఎం విజయ్ భేటీ - కీలక నిర్ణయాలు..!!
విజయవాడ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళనాడు సీఎం విజయ్ ముఖ్యమంత్రి హోదాలో తొలి సారి ఏపీకి వస్తున్నారు. విజయవాడ ఉత్సవ్ 2.0 లో పాల్గొనేందుకు వస్తున్న విజయ్ సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ తోనూ విజయ్ సమావేశం కానున్నారు. తమిళనాడులో విజయ్ గెలుపు తరువాత పవన్ పైన రాజకీయంగా కొన్ని వ్యాఖ్యలు వినిపించాయి. కాగా.. ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో విజయవాడ లో విజయ్ ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం తో సమావేశం కావటం ఆసక్తిగా మారుతోంది.
తమిళనాడు సీఎం విజయ్ ఈ నెల 13వ తేదీ విజయవాడ కు రానున్నారు. ఈ మేరకు అధికారిక షెడ్యూల్ ఖరారైంది. తమిళనాడు సీఎం అయిన సమయం నుంచి జాతీయ రాజకీయాల్లో కీలకం గా మారారు. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లోనూ విజయ్ పార్టీ విజయం సాధించింది. ఈ రోజు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చెన్నైలో విజయ్ తో సమావేశం అయ్యారు. రేపు (ఆదివారం) ప్రధాని మోదీ తమిళనాడు పర్యటన వేళ సీఎం విజయ్ భేటీ అవుతున్నారు. రాష్ట్ర అంశాల పైన చర్చించనున్నారు. మెట్రో ఫేజ్ -2 ను ప్రధాని ప్రారంభించనున్నారు. కాగా.. విజయవాడ లో దసరా2.0 ఉత్సవాలకు ఏపీకి చెందిన నేతలు ఇప్పటికే విజయ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. దీంతో.. విజయ్ ఈ నెల 13న విజయవాడ వచ్చేందుకు సిద్దం అవుతున్నారు.

భేటీ వేళ కీలక చర్చలు
విజయ్ విజయవాడ లో దసరా ఉత్సవాల్లో పాల్గొననున్నారు. అదే విధంగా సీఎం చంద్రబాబుతో కృష్ణా జలాల వాటాపై సీఎం విజయ్ కీలక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. తెలుగు గంగ ఒప్పందం ప్రకారం నీరు అందడం లేదంటు తమిళనాడు ప్రభుత్వం చేస్తున్న వాదనల వేళ ఈ భేటీ కీలకంగా మారుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కూడా సీఎం విజయ్ భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. విజయవాడ ఉత్సవ్ 2.0'లో పాల్గొననున్న సీఎం విజయ్ ప్రత్యేకం గా మరి కొందరితో భేటీ కానున్నారు. కాగా.. తమిళనాడులో విజయ్ సీఎం అయిన తరువాత కొత్త పథకాల అమలు.. ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తిగా మారాయి. మాజీ సీఎం జగన్ తో సత్సంబంధాలు ఉన్న విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో విజయవాడకు రావటం చంద్రబాబు, పవన్ తో భేటీ కానుండటం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.













Click it and Unblock the Notifications
