శ్రీవారి సేవలో గవర్నర్ రోశయ్య (ఫోటోలు)
తిరుమల: తమిళనాడు గవర్నర్ రోశయ్య మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. చెన్నై నుంచి రోడ్డు మార్గాన తిరుమల చేరుకున్న రోశయ్యకు పద్మావతీ అతిథి గృహంలో అధికారులు బస ఏర్పాట్లు చేశారు. సంవత్సరాంతం కావడంతో తిరుమలకు సాధారణ భుక్తులతో పాటు విఐపీల తాకిడీ పెరిగింది.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
విఐపీ దర్శనంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇటీవలే రోశయ్య మనమరాలి వివాహం జరిగింది. నూతన దంపతులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రోశయ్యను టీటీడీ వేద పండితులు రంగనాయకుల మండలంలో శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేశారు.
అనంతరం గవర్నర్ రోశయ్య మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చానని అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నారు. అందరూ సంతోషంగా ఉండాలని దేవుడిని వేడుకున్నట్లు తెలిపారు.
మంగళవారం గవర్నర్ రోశయ్యతో పాటు మాజీ ముఖ్యమంత్రి కిరణ కుమార్ రెడ్డి, అపోలో ఆసుపత్రి అధినేత ప్రతాప్ రెడ్డిలు కూడా వెంకన్న దర్శనం చేసుకున్నారు.

శ్రీవారి సేవలో తమిళనాడు గవర్నర్ రోశయ్య
మంగళవారం ఉదయం తమిళనాడు గవర్నర్ రోశయ్య తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్ధానం అధికారులు ఆయనకు శ్రీవారి చిత్రపటాన్ని బహుకరిస్తున్న దృశ్యం.

శ్రీవారి సేవలో తమిళనాడు గవర్నర్ రోశయ్య
మంగళవారం ఉదయం తమిళనాడు గవర్నర్ రోశయ్య తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రోశయ్యను టీటీడీ వేద పండితులు రంగనాయకుల మండలంలో శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేశారు.

శ్రీవారి సేవలో తమిళనాడు గవర్నర్ రోశయ్య
చెన్నై నుంచి రోడ్డు మార్గాన తిరుమల చేరుకున్న రోశయ్యకు పద్మావతీ అతిథి గృహంలో అధికారులు బస ఏర్పాట్లు చేశారు. సంవత్సరాంతం కావడంతో తిరుమలకు సాధారణ భుక్తులతో పాటు విఐపీల తాకిడీ పెరిగింది.

శ్రీవారి సేవలో తమిళనాడు గవర్నర్ రోశయ్య
ధ్వజస్ధంబానికి మొక్కుతున్న గవర్నర్ రోశయ్య. మంగళవారం గవర్నర్ రోశయ్యతో పాటు మాజీ ముఖ్యమంత్రి కిరణ కుమార్ రెడ్డి, అపోలో ఆసుపత్రి అధినేత ప్రతాప్ రెడ్డిలు కూడా వెంకన్న దర్శనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications