సీఎం విజయ్ నిర్ణయాన్ని స్వాగతిస్తోన్న ఎయిర్ లైన్స్

తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ పై వసూలు చేసే వ్యాట్ ను భారీగా తగ్గించింది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలకు నింపే ఇంధనంపై వసూలు చేస్తోన్న వ్యాట్‌ను 29 శాతం నుంచి 16 శాతానికి కుదించింది. మధురై, తిరుచిరాపల్లి, కోయంబత్తూర్ వంటి ఇతర విమానాశ్రయాల్లో విమాన ఇంధనంపై వ్యాట్‌ను ఏకంగా ఒక శాతానికి తగ్గించింది. ఈ మేరకు వాణిజ్య పన్నుల మరియు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇప్పటివరకు తమిళనాడులో అమలులో ఉన్న 29 శాతం వ్యాట్ రేటు దేశంలోనే అత్యధిక పన్ను రేట్లలో ఒకటిగా ఉండేది. దీనివల్ల విమానయాన సంస్థలు చెన్నై విమానాశ్రయంలో ఇంధనాన్ని నింపుకోవడానికి వెనుకాడేవి. అధిక పన్ను భారంతో విమాన సర్వీసుల నిర్వహణ వ్యయం పెరగడమే కాకుండా, విమాన సంస్థలు ఇంధనం కోసం పొరుగు రాష్ట్రాల విమానాశ్రయాల వైపు మొగ్గు చూపేవి. ఈ పరిస్థితి నుంచి విమానయాన సంస్థలను బయటపడేయడానికి వ్యాట్ ను తగ్గించింది ప్రభుత్వం.

Tamil Nadu Govt has reduced ATF VAT from 29 to 16 Percent for aircraft refuelling at Chennai Airport

ఈ గెజిట్ ప్రకారం.. ఈ పన్ను రేట్లు ఈ నెల 31వ తేదీ అర్ధరాత్రి నుంచి అమలులోకి రానుంది. ఏడాది పాటు అంటే 2027 అక్టోబర్ 31 అర్ధరాత్రి వరకు అమలులో ఉంటుంది. వ్యాట్ మినహాయింపు పొందడానికి చమురు విక్రయ సంస్థలు ప్రతి నెలా సమర్పించే రిటర్నులతో పాటు విమానయాన సంస్థలు ఇచ్చిన డిక్లేరేషన్ ను వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఈ పన్ను తగ్గింపు వల్ల ఎయిర్‌లైన్స్ సంస్థలకు భారీగా నిర్వహణ వ్యయం తగ్గనుంది.

నిరసనల వేళ.. దూకుడు పెంచిన ఈసీ: తమిళనాడు సహా 17 రాష్ట్రాలకు తాజా ఆదేశాలు
నిరసనల వేళ.. దూకుడు పెంచిన ఈసీ: తమిళనాడు సహా 17 రాష్ట్రాలకు తాజా ఆదేశాలు

ప్రస్తుతం కేరళ ప్రభుత్వం విమాన ఇంధనంపై ఒకశాతం మాత్రమే ఫ్లాట్ వ్యాట్ వసూలు చేస్తోంది. ఏపీ, తెలంగాణ కూడా తమ పన్ను రేట్లను సరళతరం చేశాయి. ఒక శాతానికి తగ్గించాయి. ఇప్పుడు తమిళనాడు కూడా అదే బాట పట్టింది. ఈ పన్ను మినహాయింపు వల్ల విమాన ప్రయాణికులకు నేరుగా పెద్దగా ప్రయోజనాలు ఉండకపోవచ్చు. వ్యాట్ తగ్గించడం వల్ల మిగిలిన మొత్తాన్ని ప్రయాణికులకు బదలాయించవు విమానయాన సంస్థలు. తమ నష్టాలను భర్తీ చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తాయి.. ఈ మొత్తంతో.

ఉప ఎన్నికల్లో పట్టం కట్టిన ఆ స్థానాలకు భారీ ప్రాజెక్టులను ప్రకటించిన విజయ్
ఉప ఎన్నికల్లో పట్టం కట్టిన ఆ స్థానాలకు భారీ ప్రాజెక్టులను ప్రకటించిన విజయ్

నిజానికి.. విమాన సంస్థల మొత్తం నిర్వహణ వ్యయంలో ఒక్క ఇంధన ఖర్చులే దాదాపు 40 శాతానికి పైగా ఆక్రమిస్తాయి. పన్ను రేట్ల తగ్గింపుతో విమానయాన సంస్థలు తమ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తాయి. చెన్నై నుంచి మరిన్ని డైరెక్ట్ ఫ్లైట్లను పెంచడంతో పాటు టైర్ 2 సిటీలు మదురై, తిరుచిరాపల్లి, కోయంబత్తూర్ వంటి విమానాశ్రయాల నుంచి కొత్త రూట్లను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు లేకపోలేదు.

తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని దాదాపుగా దేశీయ పౌర విమానయాన సంస్థలన్నీ స్వాగతిస్తోన్నాయి. ఈ మేరకు ట్వీట్లు పోస్ట్ చేస్తోన్నాయి. ఎయిరిండియా, ఆకాశ, ఇండిగో.. వంటి విమానయాన సంస్థలు ముఖ్యమంత్రి విజయ్ కు ధన్యవాదాలు తెలియజేస్తోన్నాయి. వ్యాట్ తగ్గింపు వల్ల వచ్చే మిగులు ఆదాయం ఎంతగానో ఊరట కలిగిస్తుందని, దీన్ని ప్రయాణికులకు బదలాయించే అవకాశాలను పరిశీలిస్తామని చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+