పార్టీ నుంచి బయటకు గెంటేసి ..ఇప్పుడు ఏడుపులా.. టీడీపీపై మండిపడ్డ తమ్మారెడ్డి
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఆయన అరెస్ట్ అయి మూడు వారాలు కావొస్తుంది. చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్‌ను అధికార వైసీపీ సమర్థించుకోగా, ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ , జనసేన పార్టీలు ఖండించాయి.
రాజకీయ పార్టీలకు అతీతంగా చంద్రబాబు అరెస్ట్‌ను కొందరు ఖండించారు. అయితే చంద్రబాబు అరెస్ట్‌పై ఇప్పటి వరకూ జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. చంద్రబాబు అరెస్ట్‌పై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తారని చాలామంది ఆతృతగా ఎదురు చూశారు. ముఖ్యం టీడీపీ నాయకులు, పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ ఏదోరకంగా స్పందిస్తారని ఆశపడ్డారు. కాని ఆయన మాత్రం చంద్రబాబు అరెస్ట్‌పై మౌనం వహించారు.

తాజాగా దీనిపై బాలయ్య కూడా మాట్లాడటం జరిగింది. చంద్రబాబు అరెస్ట్‌పై ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదని బాలయ్యను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఎవరు స్పందించిన, స్పందించకపోయినా..తమ పని తాము చేసుకుంటూ పోతామని ఆయన వెల్లడించారు. తాజాగా ఈ వ్యవహరంపై ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా తనదైనశైలిలో స్పందించారు.

చంద్రబాబు అరెస్ట్ అయితే జూనియర్ ఎన్టీఆర్‌కు ఏం సంబంధం అని .. అసలు ఆయన స్పందించాల్సిన అవసరం ఏముందని తమ్మారెడ్డి ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్‌ను మొదటి నుంచి కూడా నందమూరి కుటుంబం దూరం పెట్టిందని.. ఆయనకు వచ్చిన మాస్ ఇమేజ్‌ను క్యాష్ చేసుకోవాలని టీడీపీ చూసిందని తమ్మారెడ్డి తెలిపారు.
2009 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ను వాడుకుని అధికారంలోకి చూశారని..చంద్రబాబు పిలిచారని..ఆ ఎన్నికల్లో తన తాత స్థాపించిన పార్టీ గెలుపు కోసం ఆయన కృషి చేశారని తమ్మారెడ్డి గుర్తు చేశారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌కు యాక్సిడెంట్ అవ్వడానికి కూడా టీడీపీనే కారణంగా ఆయన అభివర్ణించారు. అలాంటి వ్యక్తిని 2014 ఎన్నికల్లో కావాలనే పార్టీకి దూరంగా పెట్టింది ఎవరని తమ్మారెడ్డి ప్రశ్నించారు.

2014 ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్‌ను కలుపుకోలేదని..అప్పుడు ఎన్టీఆర్ వస్తే తమకు టీడీపీలో చోటు ఉండదనే అభద్రత భావంతోనే ఆయన్ను పార్టీకి దూరం చేశారని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి మరి ఆయన్ను కలిసిన చంద్రబాబుకు అప్పుడు ఎన్టీఆర్ గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్‌తో సమానంగా క్రేజ్ ఉన్న ఎన్టీఆర్‌ను వద్దనుకునే కదా... మీరు అప్పుడు బయట వ్యక్తి పవన్ కావాలని వెళ్లారు. మరి అలాంటప్పుడు చంద్రబాబు అరెస్ట్‌పై ఇప్పుడు ఎన్టీఆర్ స్పందించడం లేదని అడగడం ఎంతవరకు సరైందో చెప్పాలని తమ్మారెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications