మరో వివాదం: విజయవాడలో సినీ నటి తారా చౌదరి అరెస్టు
విజయవాడ: ప్రముఖ నటి తారా చౌదరి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తన వదిన కవిత పైన తార దాడి చేశారంటూ విజయవాడలో గురువారం నాడు కేసు నమోదయిందని తెలుస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో రాత్రి తారా చౌదరి... వదిన పైన దాడికి ప్రయత్నించిందని సమాచారం.
గృహహింస కేసులో తారా చౌదరిని అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన మహిళా కానిస్టేబుల్ పైన కూడా ఆమె దాడికి పాల్పడిందని తెలుస్తోంది. ఈ ఘటనలో తారా చౌదరి వదిన కవితతో పాటు మహిళా కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి.

గృహహింస, కానిస్టేబుల్ పైన దాడి నేపథ్యంలో తారా చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వదిన ఫిర్యాదుతో పోలీసులు తార పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం నాడు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తారా చౌదరి గతంలో వ్యభిచారం కేసులోను అరెస్టయ్యారు.












Click it and Unblock the Notifications