పవన్ సభలో తారక్.. ప్రభాస్ ఫ్యాన్స్ , కానీ - మద్దతు ఎటో తేల్చేసారు..!!

జనసేనాని పవన్ తొలి విడత వారాహి యాత్ర ముగిసింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి లక్ష్యంగా పవన్ యాత్ర కొనసాగింది. ఎక్కడా పొత్తుల గురించి ప్రస్తావన లేదు. టీడీపీ, బీజేపీ గురించి మాట్లాడలేదు. ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు రాకూడదని పవన్ పిలుపునిచ్చారు. తాను సీఎం అవుతానని చెప్పుకొచ్చారు. ఈ సారి ప్రత్యేకంగా ప్రతీ సభలో హీరోల పేర్లు..ఫ్యాన్స్ గురించి ప్రస్తావించారు. వారి మద్దతు కోరారు. అందులో భాగంగా భీమవరం సభలో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

పవన్ కొత్త రాజకీయం: పవన్ కల్యాణ్ గోదావరి జిల్లాల్లో యాత్ర సభల్లో హీరోల పేర్లు పదే పదే చెప్పుకొచ్చారు. తనకు హీరోలు అందరూ ఇష్టమని చెప్పారు. అందరు హీరోలు కలిస్తేనే సినిమా పరిశ్రమ అని..తాను ఒక్కడి కారణంగా పరిశ్రమ లేదని వివరించారు. హీరో ఎన్టీఆర్, ప్రభాస్, మహేశ్, రాం చరణ్, మెగాస్టార్ చిరంజీవి తనకు ఇష్టమని పేర్కొన్నారు.

Tarak and Parbahas

ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా పేర్కొన్నారు. తారక్, రాం చరణ్ గ్లోబల్ హీరోలుగా పవన్ అభివర్ణించారు. తన కంటే గొప్ప హీరోలని చెప్పటం ద్వారా వారి ఫ్యాన్స్ ను ఆకట్టుకొనే ప్రయత్నం చేసారు. హీరోలకు అభిమానులు ఉండటం సహజమని..రాజకీయంగా మాత్రం రాష్ట్రం కోసం మద్దతుగా నిలవాలని కోరారు. తానెప్పుడూ పవన్ ఫ్యాన్స్ అని ఎక్కడా ఏర్పాటు చేయలేదన్నారు.

పవన్ సభల్లో హీరోల ఫ్యాన్స్: అభిమానులు..హీరోల పేర్లతో గొడవలు పడటం సరికాదన్నారు. అందరి హీరోల గొప్పతనం గురించి వివరిస్తూ వారి అభిమానులను పవన్ ఆకట్టుకోవటం లో కొంత మేర సక్సెస్ అయ్యారు. హీరో ప్రభాస్ సొంత నియోజవకర్గం నర్సాపురం సభలో పవన్ చేసిన ప్రసంగం సినీ..పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తిని పెంచింది. అభిమానులు ఏ హీరోని అభిమానించినా మీ ఓటు మాత్రం తనకే వేయాలని, రాజకీయంగా సపోర్ట్ చెయ్యాలని పవన్ కోరారు.

జనసేనకు మద్దతివ్వాల్సిందిగా ప్రభాస్ అభిమానుల్ని కోరారు. ఇదే వారాహి సభలో ఇంతకుముందు తారక్ గురించి ప్రస్తావిస్తూ ఆయన అభిమానులను దగ్గరయ్యారు. దీంతో ఇప్పుడు భీమవరం సభలో ప్రభాస్.. తారక్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో కనిపించారు. పవన్ అభిమానులతో కలిసి వారు ఈ సభలో పాల్గొనటం కొత్త సమీకరణాలకు వేదికగా మారుతోంది.

Tarak and Parbahas

మద్దతు లభించేనా: ఇక పవన్ వారాహి యాత్ర తొలి విడత ముగింపు సభ భీమవరంలో జరిగింది. ఈ సభకు జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ రావడం ప్రత్యేక చర్చకు దారి తీసింది. వీరంతా పవన్ సభలో పాల్గొనటం ద్వారా మద్దతుగా నిలిచారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రత్యక్ష రాజకీయాల్లో లేనందున పవన్‌కు మద్దతు ఇస్తున్నామంటూ కొందరు తారక్ అభిమానులు చెప్పటం ఆసక్తి కరంగా మారుతోంది.

తారక్ టీడీపీకి దూరంగా ఉంటుందటంతో ఫ్యాన్స్ రాజకీయంగా మద్దతు విషయంలో ఆలోచనలో పడినట్లు కనిపిస్తోంది. గోదావరి జిల్లాల్లోని యువతో రాజకీయంతో పాటగా..సినీ అభిమానం కూడా ఎక్కవే. ఇప్పుడు వారి అభిమానం తన వైపు తిప్పుకొనేందుకు పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో..ప్రముఖ హీరోల అభిమానులు పవన్ కోరినట్లుగా మద్దతుగా నిలుస్తారా..రాజకీయంగా తమ నిర్ణయం ఏంటనేది ప్రకటిస్తారా చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+