రాజకీయాల్లోకి వస్తా: నందమూరి హీరో తారకరత్న

మాజీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణకు నందమూరి కుటుంబ సభ్యులతో ఏ విధమైన విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు త్వరలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. ఫిట్నెస్ కోసమే తాను సన్నబడ్డానని, సిక్స్ ప్యాక్ కోసం కాదని చెప్పారు.
తాను నటించిన అలెగ్జాండర్ సినిమా ఈ నెలలో విడుదలవుతుందని తారకరత్న చెప్పారు. రెండేళ్లుగా మంచి స్క్రిప్టు దొరకకు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పారు. తన బాబాయ్ నందమూరి బాలకృష్ణ రానున్న ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారని ఆయన ఇటీవల చెప్పారు. ఆయన ఎక్కడి నుండి పోటీ చేస్తారనే విషయం పార్టీ నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. బాలకృష్ణ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తారని తెలిపారు.
బాలయ్య, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లు ప్రచారంలో పాల్గొంటారని కూడా తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆస్తులు ఏవీ సంపాదించలేదని, కోట్లాది ప్రజల ఆదరణను ఆయన కూడగట్టుకున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications