టార్గెట్ బీజేపీ, మారుతున్న సమీకరణాలు - ఆ ఇద్దరూ ఎవరి వైపు..!!
2024 ఎన్నికలకు కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. కర్ణాటక కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ప్రతిపక్షాల బలం ఐక్యత చాటేందుకు వేదికగా మారింది. బీజేపీ లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామనే సంకేతాలు ఇచ్చాయి. ప్రతిపక్షాల భారీ ఈవెంట్ కు ఆప్..టీఎంసీ దూరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా ఒడిశా సీఎం తటస్థంగా ఉంటున్నారు. దీంతో..ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ మద్దతు పార్టీలపై క్లారిటీ వస్తోంది. తెలుగు ప్రాంతీయ పార్టీలు ఎవరి వైపు. లెక్కలు మారుతున్నాయా.
విపక్షాల ఐక్య వేదికగా :కర్ణాటక లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. పూర్తి మెజార్టీతో గెలిచిన వేళ కాంగ్రెస్ నాయకత్వంలో సంతోషం కనిపిస్తోంది. అగ్ర నేతలు తరలి వచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో పాటుగా ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తరలి వచ్చారు. మిత్రపక్షాల నేతలు నితీశ్ కుమార్ తో పాటుగా శరద్ పవార్, తమిళనాడు సీఎం స్టాలిన్, సీపీఐ నేత రాజా, సీపీఎం నేత సీతారాం ఏచూరి, ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్ హాజరయ్యారు. దీని ద్వారా బీజేపీ వ్యతిరేక పార్టీల ఐక్య వేదికకు కర్ణాటక వేదికగా నిలిచింది. బీజేపీ లక్ష్యంగా ఈ నేతలంతా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తొలి అడుగు పడింది. ఇదే సమయంలో భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు స్పష్టత ఇచ్చారు.

ఆ ఇద్దరు నేతలు దూరం:ఇదే సమయంలో బీజేపీ పైన పోరాటం చేస్తున్నా..కాంగ్రెస్ తో టీఎంసీ, ఆప్ దూరం పాటిస్తున్నాయి. ఈ రెండు పార్టీల చీఫ్ లు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరు కాలేదు. మూడు రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీల ప్రభావం బలంగా ఉంది. ఈ రెండు పార్టీలతో కాంగ్రెస్ నాయకత్వం సైతం ఆచి తూచి వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ కు పూర్తిగా మద్దతు ఇస్తూ వచ్చిన సమాజ్ వాదీ నుంచి ఈ కార్యక్రమానికి ఎవరూ హాజరు కాలేదు. రానున్న ఆరు నెలల కాలంలో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక తరహా పాలసీని అమలు చేసి అక్కడా పట్టు నిరూపించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణలో నూ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అధికార బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిసేందుకు సిద్దంగా లేదు.
మారుతున్న సమీకరణాలు:ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఇతర పార్టీల నేతలెవరూ హాజరు కాలేదు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు దూరం గా ఉంటోంది. బీజేపీకి అవసరమైన సమయంలో మద్దతు ఇస్తోంది. బీజేపీతో జనసేన మిత్రపక్షంగా ఉంది. టీడీపీ, జనసేన రెండు పార్టీలో వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీతో కలిసి పోరాటం చేయాలని భావిస్తున్నాయి. బీజేపీ నిర్ణయం తేలాల్సి ఉంది. ఈ సమయంలో మరి కొద్ది రోజుల్లోనే ఏపీలోని ఈ మూడు పార్టీలు ఎవరు ఎవరితో కలుస్తారనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications