పోలీసు 'విభజన'పై చర్చ, త్వరలో అన్నీ (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత రెండు వైపులా శక్తివంతమైన పోలీసు విభాగాలు ఉండాలని కేంద్ర హోంశాఖ ఉన్నతస్థాయి బృందం సభ్యులు విజయకుమార్ మంగళవారం అన్నారు. హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల శిక్షణా సంస్థకు చెందిన సుపరిపాలనా భవనంలో కేంద్ర హోంశాఖ ఉన్నతస్థాయి బృందం సమావేశం ముగిసిన అనంతరం విజయకుమార్ విలేకరులతో మాట్లాడారు.
ఇది ప్రాథమిక సమావేశం అన్నారు. రేపు, ఎల్లుండి సమావేశమవుతామన్నారు. పోలీసు శాఖ అంశంపై చర్చించినట్లు చెప్పారు. విభజన తర్వాత రెండు వైపులా శక్తివంతమైన పోలీసు విభాగాలు ఉండాలన్నారు. ఈ ఒక్క అంశం పైనే తాము చర్చించామని, త్వరలో అన్ని విషయాలు చెబుతామన్నారు. ఇరు ప్రాంతాల్లోను పోలీసు శిక్షణ, రక్షణ సదుపాయాలపై అభిప్రాయాలను తీసుకున్నామన్నారు.
కాగా, రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాక శాంతి భద్రతల సమస్యలపై ఈ బృందం చర్చించింది. ఉమ్మడి రాజధానిలో ఢిల్లీ తరహా పోలీసింగ్ వ్యవస్థ వంటి అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు, ఐపిఎస్‌ల నుండి అభిప్రాయాలను సేకరించారు.
విభజన తర్వాత హైదరాబాద్ శాంతిభద్రతలపై, పోలీసు విభాగంలో అస్తులను విభజించే అంశాలపైన చర్చించారు. అధికారుల నుండి నివేదికలు కోరారు. పోలీసు ఆస్తులు, ఉద్యోగాలు, బెటాలియన్స్, గ్రేహౌండ్స్, పోలీసు అకాడమీ, ఆక్టోపస్ తదితర వివరాలు సేకరిస్తున్నారు. విభజన తర్వాత హైదరాబాదులో, సీమాంధ్రలో, తెలంగాణలో ఎంత పోలీసు ఫోర్సు ఉండాలనే విషయమై చర్చించారు. మరోవైపు టాస్క్‌ఫోర్సులో తెలంగాణ నుంచి డిజిపిలు ఎవరు లేరని తెరాస జివోఎంకు ఫిర్యాదు చేసింది. దీంతో పేర్వారం రాములుకు ఆహ్వానం అందింది.

టాస్క్ 1
టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యుడు విజయకుమార్ శంషాబాద్ రైల్వే స్టేషన్ నుండి బయటకు వస్తున్న దృశ్యం. ఈ రోజు టాస్క్‌ఫోర్స్ భేటీ అయింది.

టాస్క్ 2
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలోని సుపరిపాలనా భవనంలో విజయకుమార్ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర హోంశాఖ ఉన్నతస్థాయి సమావేశం.

టాస్క్ 3
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలోని సుపరిపాలనా భవనంలో విజయకుమార్ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర హోంశాఖ ఉన్నతస్థాయి సమావేశం. సమావేశంలో హాజరైన పోలీసు అధికారులు.

టాస్క్ 4
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలోని సుపరిపాలనా భవనంలో విజయకుమార్ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర హోంశాఖ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

టాస్క్ 5
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలోని సుపరిపాలనా భవనంలో విజయకుమార్ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర హోంశాఖ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. సమాలోచనల దృశ్యం.

టాస్క్ 6
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలోని సుపరిపాలనా భవనంలో విజయకుమార్ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర హోంశాఖ ఉన్నతస్థాయి సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న దృశ్యం.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications