లోకేష్ భేటీ: విశాఖకు టీసీఎస్, 10 వేల మందికి ఉద్యోగాలు

ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ (Tata Consultancy Services) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వివరాలను వెల్లడించారు. విశాఖపట్నంలో టీసీఎస్ తన కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. టీసీఎస్ సెంటర్ రాకతో రాష్ట్రంలోని 10 వేల మందికి ఐటీ ఉద్యోగాలు లభించనున్నాయి. మంగళవారం ముంబైలో టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో మంత్రి లోకేష్ భేటీ అయిన విషయంతెలిసిందే.

ఈవీ, ఎయిరో స్పేస్ రంగాల్లో పెట్టుబడులు పరిశీలిస్తామని టాటా గ్రూప్ తెలిపింది. మరోవైపు, స్టీల్, టూరిజం రంగాల్లోనూ పెట్టుబడులు పరిశీలిస్తామని పేర్కొంది. మంత్రి లోకేష్ భేటీ అనంతరం టీసీఎస్ తన కేంద్రాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. విశాఖకు టీసీఎస్ రావడం పట్ల నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు.

TCS to Visakhapatnam Jobs for 10 thousand people

లులు, ఒబెరాయ్, బ్రూక్ ఫీల్డ్, సుజలాన్ తర్వాత ఏపీకి టీసీఎస్ రానుండటం గమనార్హం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో కంపెనీలను ఆహ్వానిస్తున్నామని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా తెలిపారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామికాభివృద్ధిలో రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచేందుకు ఇది తొలి అడుగని లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ విశాఖలో ఏర్పాటు చేసి 10 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు ప్రకటించడం చాలా ఆనందంగా ఉందన్నారు లోకేష్. టీసీఎస్ రాకతో విశాఖపట్నం ఐటీ హబ్‌గా మారనుందని, ప్రఖ్యాత కంపెనీల పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ మారుతుందని లోకేష్ పేర్కొన్నారు. అత్యుత్తమ పెట్టుబడి వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేష్ చెప్పారు.

మంత్రి నారా లోకేష్ చొరవతో విశాఖలో టీసీఎస్ భారీ పెట్టుబడులు పెట్టడంతోపాటు 10 వేల మందికి ఉద్యోగాలు అందిస్తామని ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధిస్తుందని పేర్కొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+