బాలయ్యకు హిందుపురం: టిడిపి థర్డ్ లిస్ట్‌లో టిజి, గంటా
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అర్థరాత్రి సీమాంధ్రలో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేశారు. బాలకృష్ణ హిందూపురం నుండి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. భీమిలి నుండి గంటా శ్రీనివాస రావు బరిలోకి దిగనున్నారు. మూడో జాబితాలో 3 లోకసభ, 32 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
అదే సమయంలో సీమాంధ్రలో టిడిపి, బిజెపి మధ్య పొత్తుల సీట్లు ఖరారయ్యాయి. 4 ఎంపీ, 14 అసెంబ్లీ సీట్లు, రెండు ఎమ్మెల్సీలు బిజెపికి ఇవ్వడానికి టిడిపి అంగీకరించింది. గతంలో ఆ పార్టీకి 5 ఎంపీ, 15 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ సంఖ్య తగ్గకుండా చూడాలని బిజెపి నేతలు కోరడంతో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే సీటు తగ్గించి వాటి బదులు రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వాలని తాజాగా నిర్ణయించారు. గతంలో అనుకొన్న సీట్లలో కొన్ని మార్పులు చేశారు.

విజయవాడ నగరంలో సెంట్రల్ బదులు పశ్చిమ నియోజకవర్గాన్ని ఆ పార్టీకి ఇస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట బదులు ఇచ్ఛాపురం ఇవ్వాలని నిర్ణయించారు. విజయనగరం జిల్లాలో గజపతినగరం ఇవ్వాలని గతంలో అనుకొన్నా ఇప్పుడు దాని బదులు ఒక ఎమ్మెల్సీ సీటు ఆ పార్టీకి ఇవ్వనున్నారు. కృష్ణా జిల్లాలో కైకలూరు, కర్నూలు జిల్లాలో కోడుమూరు సీట్లు ఇప్పుడు బిజెపి ఖాతాలో పడ్డాయి. సీట్లు ఖరారైన తర్వాత బిజెపి సీమాంధ్ర ప్రాంత అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఆదివారం మధ్యాహ్నం ఇక్కడ చంద్రబాబును కలిసి మాట్లాడారు. బిజెపికి కేటాయించిన సీట్లు ఇవీ..
లోకసభ స్థానాలు
1) విశాఖపట్నం
2) నర్సాపురం
3) తిరుపతి
4) రాజంపేట
అసెంబ్లీ స్ధానాలు
1)ఇచ్ఛాపురం (శ్రీకాకుళం జిల్లా)
2) విశాఖపట్నం,
3) పాడేరు (విశాఖ జిల్లా)
4) రాజమండ్రి అర్బన్ (తూర్పు గోదావరి జిల్లా)
5) తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి జిల్లా)
6) విజయవాడ-పశ్చిమ
(కృష్ణాజిల్లా)
7) కైకలూరు (కృష్ణా జిల్లా),
8) నర్సరావుపేట
(గుంటూరు జిల్లా)
9) సంతనూతలపాడు
(ప్రకాశం జిల్లా)
10) నెల్లూరు రూరల్
(నెల్లూరు జిల్లా)
11) మదనపల్లి (చిత్తూరు జిల్లా)
12) అనంతపురం అర్బన్/ గుంతకల్లు (అనంతపురం జిల్లా), 13) కడప (కడప జిల్లా)
14) కోడుమూరు
(కర్నూలు జిల్లా)
టిడిపి ప్రకటించిన లోకసభ అభ్యర్థులు
అనకాపల్లి - అవంతి శ్రీనివాస్
కాకినాట - తోట నర్సింహం
అమలాపురం - డా పి రవీంద్ర బాబు
అసెంబ్లీ అభ్యర్థులు
హిందూపురం - బాలకృష్ణ
పలాస - శివాజీ
పాతపట్నం - శత్రుచర్ల విజయరామరాజు
శ్రీకాకుళం - లక్ష్మీదేవి
నరసన్నపేట - రమణమూర్తి
పార్వతీపురం - చిరంజీవిలు
గజపతినగరం - కెఏ నాయుడు
భీమిలి - గంటా శ్రీనివాస రావు
విశాఖ సౌత్ - వాసుపల్లి గణేష్ కుమార్
గాజువాక - పల్లా శ్రీనివాస్ యాదవ్
అనకపల్లి - షీలా గోవింద్
యలమంచిలి - పంచకర్ల రమేష్ బాబు
పాయకరావుపేట - వంగలపూడి అనిత
కాకినాడ సిటీ - వనమాడి వెంకటేశ్వర రావు
అచంట - పితాని సత్యనారాయణ
గోపాలపురం - ముప్పిడి వెంకటేశ్వర రావు
అవనిగడ్డ - మండలి బుద్ధప్రసాద్
విజయవాడ సెంట్రల్ - బొండా ఉమామహేశ్వర రావు
బాపట్ల - అన్నం సతీష్
గుంటూరు వెస్ట్ - మోదుగుల వేణుగోపాల్ రెడ్డి
సత్తెనపల్లి - కోడెల శివప్రసాద్
రాజంపేట - మేడా మల్లికార్జున రెడ్డి
కోడూరు - వెంకటసుబ్బయ్య
ఆళ్లగడ్డ - గంగుల ప్రభాకర్ రెడ్డి
శ్రీశైలం - శిల్పాచక్రపాణి రెడ్డి
నందికొట్కూరు - లబ్బి వెంకటస్వామి
కర్నూలు - టిజి వెంకటేష్
పాణ్యం - ఏరాసు ప్రతాప్ రెడ్డి
నంద్యాల - శిల్పామోహన్ రెడ్డి
డోన్ - కెఈ ప్రతాప్
పత్తికొండ - కెఈ కృష్ణమూర్తి
మడకశిర - ఈరన్న












Click it and Unblock the Notifications