మంత్రి దుర్గేశ్ కు తెలుగు తమ్ముళ్ల షాక్..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలైంది. అప్పుడే కూటమిలో నిరసనలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ధర్మవరంలో బీజేపీ మంత్రికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన టీడీపీ శ్రేణులు..ఇప్పుడు జనసేన మంత్రికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తాము గెలిపించిన మంత్రి తమను పట్టించుకోవటం లేదని ఆగ్రహంతో ఉన్నారు. మంత్రి కందుల దుర్గేశ్ ను టీడీపీ శ్రేణులు నిలదీయటం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది.
మంత్రిపై ఆగ్రహం
రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి పల్లె పండుగ కార్యక్రమం ప్రారంభమైంది. తూర్పు గోదావరి జిల్లా మంత్రి కందుల దుర్గేశ్ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిడదవోలులోని కంసాలిపాలెం గ్రామానికి వచ్చారు. నిడుదవోలులో పొత్తు ధర్మంలో భాగంగా తామంతా సహకరించి గెలిపిస్తే.. తమను నిర్లక్ష్యం చేయటం పైన స్థానిక టీడీపీ కేడర్ ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇప్పుడు మంత్రి తమ ప్రాంతానికి రావటంతో వారంతా నిలదీసారు. పల్లె పండుగ సంబంధించి తమకు ఎలాంటి సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

పట్టించుకోవటం లేదంటూ
అధికారంలోకి వచ్చి మంత్రి అయిన సమయం నుంచి తమను పట్టించుకోవటం లేదంటూ కందుల దుర్గేశ్ పైన మండిపడ్డారు. తమ మద్దతు లేకపోతే ఎన్నికల ఫలితం ఎలా ఉండేదో ఆలోచన చేసుకోవాలని హెచ్చరించారు. తమ సమస్యల గురించి ప్రస్తావన చేస్తుంటే.. మంత్రికి మద్దతుగా కడియం నుంచి వచ్చిన వారు తమ పైన దుర్భాషలాడటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో, మంత్రి వారిని సముదాయించే ప్రయత్నం చేసారు. అందరినీ కలుపుకొని వెళ్లేందుకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
జనసేన మంత్రి కందుల దుర్గేష్‌ను అడ్డుకున్న టీడీపీ నాయకులు
— Telugu Scribe (@TeluguScribe) October 14, 2024
నిడదవోలు మండలం కంసాలిపాలెంలో మంత్రి కందుల దుర్గేష్ హాజరైన పల్లె పండుగ కార్యక్రమంలో ఉద్రిక్తత.
జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన తమకు ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని… pic.twitter.com/9jbwihLNAw
కొరవడిన సమన్వయం
అయితే, జిల్లాలో మూడు పార్టీల నేతలు - కేడర్ మధ్య సమన్వయం కొరవడుతోందనే వాదన వినిపిస్తోంది. మంత్రులు మూడు పార్టీల కేడర్ ను పట్టించుకోవటం లేదనే ఫిర్యాదులు పార్టీ అధినాయకత్వానికి అందుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని ఇద్దరు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు పార్టీల కార్యకర్తలను ఎక్కడా పట్టించుకోవటం లేదని.. ఎవరైనా కలిసేందుకు ప్రయత్నం చేస్తే వారికి అవకాశం ఇవ్వటం లేదని మండిపడుతున్నారు. ఇక, మంత్రి కందుల దుర్గేశ్ ని టీడీపీ మద్దతు దారులు నిలదీయటం పైన జిల్లాలో రాజకీయంగా చర్చ జరుగుతోంది.
-
ఒక్క దెబ్బకు మూడు పిట్టలు కాదు.. ఒక్క నామినేషన్‌కు మూడు పార్టీలు! -
వైసీపీ మాజీ మంత్రికి భారీ షాక్- ఆరు నెలల జైలుశిక్ష..! -
ప్రతి నెలా రూ. 3,000 సాయం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు -
West Bengal: బీజేపీతో బంధం బట్టబయలు-ముస్లిం పార్టీతో ఎంఐఎం కటాఫ్..! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు












Click it and Unblock the Notifications