మంత్రి ‘పితాని’పై తమ్ముళ్ల ఆగ్రహం: ఆ మాటతో రెట్టింపు
ఇటీవలే పార్టీ లోకి వచ్చి మమ్మల్ని వెళ్లిపోమంటారా!? ఎన్ని రోజులు ఈ సమస్యను సాగదీస్తారoటూ నిలదీత
చింతలపూడి : పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ టీడీపీలో కొద్ది నెలలుగా రగులుతున్న అసమ్మతి భగ్గుమంది. ఏలూరు జెడ్పీ గెస్ట్‌హౌస్ వేదికగా ఎంపీ మాగంటి బాబు వర్గీయులు మంత్రులను నిలదీశారు. దీంతో సహనం కోల్పోయిన మంత్రి పితాని సత్యనారాయణ.. 'మీకు చేతనైంది చేసుకోండి' అని చెప్పడంతో వారిలో ఆగ్రహం రెట్టింపైంది.
వివరాల్లోకి వెళ్తే.. చింతలపూడి ఏఎంసీ ఛైర్మన్ వ్యవహారంలో మాజీమంత్రి పీతల సుజాత వర్గానికి, ఎంపీ మాగంటి బాబు వర్గానికి గత మూడేళ్లుగా వివాదం నడుస్తోంది. శుక్రవారం చింతలపూడిలో సమన్వయ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఇరువర్గాలతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని నిర్ణయించారు. ఇన్‌చార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు ఈ బాధ్యతను జిల్లా మంత్రి పితాని సత్యనారాయణకు అప్పగించారు.
బాబు వర్గీయులు సమస్యను ఇప్పటికిప్పుడు పరిష్కరించకపోతే రాజీనామాలు చేస్తామని హెచ్చరించడంతో పితాని 'మీ ఇష్టమైంది చేసుకోండి' అంటూ అసహనం వ్యక్తంచేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు మీరు నిన్నకాక మొన్న పార్టీలోకి వచ్చి మమ్మల్ని రాజీనామా చేసుకోమంటారా అంటూ మంత్రిపై విరుచుకుపడ్డారు.

పేకాడుతున్నా మావాళ్లను అరెస్టు చెయ్యొద్దు
ఈ సమావేశంలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ కార్యకర్తలు పేకాట ఆడుతున్నా అడ్డుకోవద్దని పోలీసులకు సూచించారు. ఒకవేళ మీరు కార్యకర్తలను అరెస్టుచేస్తే మళ్లీ మేమే స్టేషన్‌కు రావాల్సి ఉంటుంది.. గుర్తుంచుకోండని చెప్పడంతో మంత్రులు, పోలీసులు అవాక్కయ్యారు. అనంతరం రాజ్యసభ సభ్యురాలు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మాగంటి బాబు వ్యాఖ్యలను పట్టించుకోవద్దని కార్యకర్తలకు సూచించారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications