శ్రీవారి లడ్డూ వివాదం, అందుకే సీఎం ఆ నిర్ణయం తీసుకున్నారు, ఆనం
తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై వివాదాలు మొదలైన తర్వాతనే నిజానిజాలు వెలుగులోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) ఏర్పాటు చేశారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో ఆనం వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం పై ఆనం వెంకటరమణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్న ప్రతి భక్తుడికి నిజం చెప్పాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉందని ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. శ్రీవారి భక్తుడికి నిజం చెప్పాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉందని, అందుకే తిరుమల శ్రీవారి లడ్డు తయారు చేయడానికి గత వైసీపీ ప్రభుత్వంలోనే అప్పటి టీటీడీ బోర్డు పాలకమండలి కల్తీ నెయ్యి ఉపయోగించారని ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు.

తిరుమల శ్రీవారి లడ్డు తయారు చేయడానికి కల్తీ నెయ్యి ఉపయోగించారని అనేక ఆధారాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీకి చెందిన వారే టీటీడీ చైర్మన్లుగా ఉన్నారని ఆనం వెంకటరమణారెడ్డి గుర్తు చేశారు. జగన్ సీఎం అయిన తర్వాత ఆయన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి, ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్లుగా పని చేశారని ఆనం వెంకటరమణారెడ్డి గుర్తు చేశారు.
వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి జగన్ కి ఎంత సన్నిహితులు అనే విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి ఉపయోగించారు అని అనడానికి అనేక ఆధారాలు బయట పడిన తర్వాతనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ విషయం ప్రజలకు చెప్పారని ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు.
గత వైసీపీ భుత్వంలో జీవోలు దాచిపెట్టే సంస్కృతి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో లేదని, ప్రతి జీవో ప్రజలకు తెలియజేయడానికి పబ్లిక్ డొమైన్ లో పెట్టారని అని ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. జగన్ లాగా అర్దరాత్రి జీవోలు దాచి విడుదల చేసే సంస్కృతిని మన సీఎం చంద్రబాబు నాయుడు పాటించడం లేదని, ఆయన ప్రజల కోసం పని చేస్తున్నారని ఆనం వెంకటరమణారెడ్డి చెప్పారు. ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంపైన, వైసీపీ నాయకుల తీరుపై ఆనం వెంకటరమణారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications